E-Paper
Advertisement

Trump Revokes Temporary Migration: 5 లక్షల మంది అమెరికా వదిలి వెళ్లిపోవాలి.. వారికి భారీ షాకిచ్చిన ట్రంప్

Trump Revokes Temporary Migration: 5 లక్షల మంది అమెరికా వదిలి వెళ్లిపోవాలి.. వారికి భారీ షాకిచ్చిన ట్రంప్
Advertisement

Trump Revokes Temporary Migration| అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుని, వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అమెరికాలో 5,30,000 మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా అమెరికాను వీడాల్సి ఉంటుంది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే టారిఫ్‌లు విధించే అంశంలో బిజీగా ఉన్న ట్రంప్, ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో 5,30,000 మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నారు. లక్షలాది మంది క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వా, వెనెజువెలా వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇక, ఒక నెలలోనే వారిని బహిష్కరించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఇజ్రాయెల్‌ విమానాశ్రయంపై దాడి చేసిన హౌతీలు.. యెమెన్ నుంచే క్షిపణి ప్రయోగం

ఈ క్రమంలో హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ.. ఆర్థిక సహాయంతో అక్టోబర్ 2022 నుండి అమెరికాకు చేరుకున్న నాలుగు దేశాల వలసదారులు అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉందని తెలిపారు. అలాగే.. అమెరికాలో పని చేయడానికి రెండు సంవత్సరాల అనుమతులు పొందిన వారు ఏప్రిల్ 24 తర్వాత వారి చట్టపరమైన హోదాను కోల్పోతారని పేర్కొంది. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో ఈ వలసదారులకు మంజూరు చేయబడిన రెండు సంవత్సరాల మానవతా పెరోల్ రద్దు కానుంది. కాగా, జో బైడెన్ 2022లో వెనెజువెలా ప్రజల కోసం పెరోల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2023లో దానిని నికరాగ్వా,  క్యూబా, హైతీ పౌరులకు కూడా విస్తరించారు. దీంతో, భారీ సంఖ్యలో వలసదారులు అమెరికాకు వచ్చారు.

Advertisement

అయితే, మానవతా పెరోల్ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనుంది. వీరంతా ఇతరుల ఆర్థిక సహాయంతో అమెరికాకు వచ్చారని, రెండేళ్ల పాటు యూఎస్‌లో నివసించడానికి, పని చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందారని హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. వీరు ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అమెరికాలో ఉండేందుకు లభించిన చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు.

మానవతా పెరోల్‌ను విస్తృతంగా దుర్వినియోగం అవుతోందని.. దీనికి ముగింపు పలుకుతామని ట్రంప్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తాజాగా అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మానవతా పెరోల్ అనేది అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉన్న వెసులుబాటు. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలుగా అధ్యక్షుడు ఈ చట్టపరమైన హోదాను కల్పిస్తారు. గత ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. అక్రమ వలసదారులను బహిష్కరించడంతో పాటు, కొందరు వలసదారులకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలను కూడా ముగిస్తామని అప్పట్లో తెలిపారు.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×