Shine Tom Chacho:ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. గత కొన్ని రోజుల క్రితం.. ఒక హోటల్ పై పోలీసులు డ్రగ్స్ రైడ్ నిర్వహించగా.. ఆ హోటల్ మూడవ అంతస్తు నుండి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకి, అక్కడి నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఇప్పుడు ఈయన తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈరోజు తన లాయర్ తో కలిసి ఉదయం 10 గంటల సమయంలో ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ వినియోగంపై పలు ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణకు హాజరైన షైన్ టామ్ చాకో..
విచారణలో భాగంగా.. డ్రగ్స్ తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి..? ఎవరు ఈ డ్రగ్ ను సరఫరా చేస్తున్నారు..? అసలు ఈ హోటల్ కి డ్రగ్స్ ఎలా వచ్చాయి..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నటి కంప్లైంట్ మేరకు.. ఆ విషయాలపై కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈరోజు ఉదయం 10 గంటలకు తన లాయర్ తో కలిసి విచారణకు హాజరైన షైన్ టామ్ చాకో బయటకు వచ్చేవరకు పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? ఈయన ఎలాంటి సమాధానం చెప్పారు..? అనే విషయాలు తెలియాలి అంటే వీరు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికైతే విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ఈయన ఇప్పుడు విచారణకు హాజరై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల కొచ్చిలోని ఒక హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే పోలీస్ బృందం హోటల్ కి రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మూడో అంతస్తులో ఉన్న ఆయన కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి.. అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి అక్కడి నుంచి పారిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి తోడు గతంలో కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అంటూ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు వచ్చేవి. దీనికి తోడు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియస్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. సినిమా సెట్ లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె వాపోయింది. దీనిపై AMMA లో ఫిర్యాదు చేయగా.. కమిటీ కూడా వేసిన విషయం తెలిసిందే.
షైన్ టామ్ చాకో సినిమాలు..
2022లో దసరా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత రంగబలి , దేవర, డాకుమహారాజ్ , రాబిన్ హుడ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
Pooja Hegde : రెట్రోకు పూజా ఎందుకు దూకుడుగా ప్రమోట్ చేస్తుంది… సినిమా కోసమా..? వ్యక్తి కోసమా..?