Shukraditya Yoga 2025: శుక్రుడు, సూర్యుడు మీన రాశిలో సంయోగం చెందనున్నారు. ఫలితంగా శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ శుక్రాదిత్య యోగం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. హోలీ ముగిసిన వెంటనే సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు ఇప్పటికే మీన రాశిలో ఉన్నాడు. ఫలితంగా మీన రాశిలో శుక్రుడు , సూర్యుడి కలయిక జరగనుంది. దీని కారణంగా శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది.
మార్చి 19న ఏర్పడనున్న ఈ శుక్రాదిత్య యోగం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ ప్రభావం 5 రాశులపై ఎక్కువగా ఉంటుంది. శుక్రాదిత్య యోగం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతే కాకుండా వారి జీవితాల్లోకి సంపద పెరుగుతుంది. మరి ఆ 5 రాశుల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి మార్చి 19 నుండి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడు, శుక్రుల కలయిక వల్ల ఏర్పడిన శుక్రాదిత్య యోగం నుండి అపారమైన ప్రయోజనాలను మీరు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆదాయంలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు. పెట్టుబడుల్లో అధిక లాభాలు కూడా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు.
మిథున రాశి:
శుక్రాదిత్య యోగం యొక్క శుభ ప్రభావం కారణంగా మిథున రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు లభించబోతున్నాయి. మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. అంతే కాకుండా వ్యాపారవేత్తలు పెట్టుబడుల నుండి లాభాలను ఆర్జించే బలమైన అవకాశం ఉంటుంది. కుటుంబంలో సోదరులు, సోదరీమణులతో సంబంధం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకుంటారు.
కన్యా రాశి:
కన్యా రాశి వారి జీవితాలపై సూర్యుడు-శుక్రుడు సంయోగం వల్ల కలిగే ప్రయోజనాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మీ గౌరవం సమాజంలో పెరుగుతుంది. అంతే కాకుండా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. గతంలో ఏదైనా వ్యాధి ఉండి ఉంటే.. అది పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
Also Read: 100 ఏళ్ల తర్వాత సప్తగ్రాహి యోగం.. వీరిపై అధిక ప్రభావం !
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు సూర్యుడు, శుక్రుడి సంయోగం ప్రభావం వల్ల సానుకూల మార్పులను చూస్తారు. మీ జీవితాల్లో భౌతిక విలాసాలు పెరుగుతాయి. అంతే కాకుండా మీరు ఆస్తి లేదా వాహనం మొదలైనవి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఉద్యోగులు పదోన్నతికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రాదిత్య యోగం వల్ల శుభ ప్రభావాలు కలుగుతాయి. అంతే కాకుండా మీ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అలాగే.. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, వివిధ రంగాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీ వ్యాపార వేగం పెరగడంతో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది