BigTV English

Putin Warns Ukraine Army: లొంగిపోతే వదిలేస్తాం లేకపోతే.. ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ వార్నింగ్

Putin Warns Ukraine Army: లొంగిపోతే వదిలేస్తాం లేకపోతే.. ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ వార్నింగ్

Putin Warns Ukraine Army Kursk| రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. కర్స్‌క్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడం మంచిదని.. లేకుంటే వారు ప్రాణాలతో ఉండరని పుతిన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో యుద్ధంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా.. పశ్చిమ రష్యాలోని కర్స్‌క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ పరిస్థితిపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఆయన తాజా ప్రకటనలో.. “కర్స్‌క్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే వారి ప్రాణాలకు హాని ఉండదు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారిని కాపాడుతాను. లేకుంటే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. రష్యా ఫెడరేషన్, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఉక్రెయిన్ సైనికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైనికులను అన్ని వైపుల నుంచి రష్యా సైన్యం చుట్టుముట్టింది.

Also Read: రష్యా అధ్యక్ష భవనం సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో అమెరికా అధికారుల చర్చల వేళ


పుతిన్‌కు ట్రంప్ విజ్ఞప్తి
మరోవైపు యుద్దం ఆపేయాలని శాంతి చర్చలు నిర్వహిస్తున్న అమెరికా ఈ అంశంపై స్పందించింది. యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ సైన్యాలను రష్యా దళాలు చుట్టుముట్టాయని.. ఈ పరిస్థితి దారుణంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది అత్యంత భీకరమైన ఘటనగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని.. మాస్కోతో జరిపిన చర్చలు ఫలించే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పుతిన్ కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ట్రంప్ స్వాగతించారు.

“ఇది ఆశాజనకమైన ప్రకటన. అయితే ఇది పూర్తిస్థాయి ప్రకటన కాదు. రష్యా కాల్పుల విరమణకు అనుకూలంగా ఉందో లేదో చూడాలి. లేకుంటే ప్రపంచానికి ఇది తీవ్ర నిరాశ కలిగించే క్షణం అవుతుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలలో ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం వెల్లడైంది.

మరోవైపు, శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా చమురు, సహజవాయువు,  బ్యాంకింగ్ రంగాలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఆంక్షలు, రష్యా బ్యాంకులు లావాదేవీలు కొనసాగించేందుకు ఇచ్చిన 60 రోజుల మినహాయింపును పొడిగించకూడదని నిర్ణయించింది. యురోప్ సమాఖ్య కూడా రష్యాకు చెందిన 2,400 మంది వ్యక్తులపై ఆంక్షలను విధించింది.

పుతిన్ ఆటలు ఆడుతున్నారు: బ్రిటన్ ప్రధాని

అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించగా, రష్యా సూత్రప్రాయంగా ఒప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

“పుతిన్ ఈ ఒప్పందంతో ఆటలు ఆడుతున్నారు. ఇది ఆలస్యం చేయాలని చూస్తున్నారు. అమెరికా ప్రయత్నిస్తుంటే, పుతిన్ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇది సహించలేనిది” అని స్టార్మర్ పేర్కొన్నారు. యురోప్, నాటో దేశాలు కూడా ఈ ఒప్పందానికి మద్దతు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా ఈ ప్రతిపాదనను తప్పనిసరిగా అంగీకరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్  పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ విషయంపై స్టార్మర్‌తో చర్చించినట్లు తెలిపారు.

Tags

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×