BigTV English

Congress on KTR: బీజేపీ విజయం, బీఆర్ఎస్ సంబరం.. కాంగ్రెస్ కౌంటర్‌‌‌‌కు తలపట్టుకున్న ఆ నేత

Congress on KTR: బీజేపీ విజయం, బీఆర్ఎస్ సంబరం.. కాంగ్రెస్ కౌంటర్‌‌‌‌కు తలపట్టుకున్న ఆ నేత

Congress on KTR: ఢిల్లీ రాజకీయ సెగ తెలంగాణకు తాకింది. ఢిల్లీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. పార్టీలన్నాక గెలుపోటములు సర్వసాధారణం. కానీ అదే పనిగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ పై కాంగ్రెస్ లీడర్స్ తో పాటు, నెటిజన్స్ కూడ సీరియస్ రిప్లై ఇస్తున్నారు. అసలు కథ ఏంటంటే..


తెలంగాణలో జరిగిన 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారం చెలాయించినప్పటికీ, ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయింది. కానీ ఏ పార్టీనైనా అప్పుడప్పుడు ఓటమి రుచి చూడాల్సిందే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయ నేతలే అంటుంటారు. అలాగే తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడ లభించలేదు. ఒక్క చోట కూడ విజయం వరించలేదు. కాంగ్రెస్ తన హవా సాగించగా, బీజేపీ కూడ అదే రీతిలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. అది కూడ సెటైరికల్ గా చేసిన ట్వీట్ పట్ల కాంగ్రెస్ నేతలు, నెటిజన్స్ ఇది కరెక్ట్ కాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ తన ట్వీట్ లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అభినందనలు తెలుపుతూ.. బీజేపీని ఢిల్లీలో గెలిపించినందుకు ఈ అభినందనలని పేర్కొన్నారు. అదే ఇప్పుడు కేటీఆర్ ను విమర్శల పాలు చేస్తోంది. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి కూడ, పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలు దక్కించుకున్న మీరు కూడ ఇలా కామెంట్స్ చేయడం తగదని, ఇలాంటి ట్వీట్స్ తో ఉన్న కాస్త మర్యాద పోగొట్టుకోవద్దని కేటీఆర్ కు నెటిజన్స్ సలహాలిస్తున్నారు.


తెలంగాణలో జీరోలో ఉన్న బీజేపీకి ఆపన్నహస్తం అందించి ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలలో విజయం దక్కించిన బీఆర్ఎస్ సంబరం మాకేమీ అర్థం కావడం లేదంటూ కాంగ్రెస్ అంటోంది. తమకు వచ్చిన జీరో మార్కులను పట్టించుకోకుండా, ఢిల్లీలో బీజేపీ గెలుపును చూసి ఆనంద పడుతున్న బీఆర్ఎస్ నెంబర్ – 2 లీడర్ కేటీఆర్ సంబరం ఎందుకో అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్ మోహన్ రెడ్డి లు స్పందించి కేటీఆర్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.

మోడీ విజయానికి అసలు సహాయం చేసిన మీ సోదరి కవితను ముందు అభినందించాలని, రాహుల్ గాంధీ దెబ్బకు రాజ్యాంగం ముందు మోడీ తలవంచారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జీరో మార్కులు ప్రజలు ఇచ్చినందుకు రాహుల్ గాంధీని అభినందించాలని సామా రామ్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక మంత్రులు పొన్నం, కోమటిరెడ్డిలు అయితే భిన్నరీతిలో స్పందించి కేటీఆర్ కు ఝలక్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను మట్టి కరిపిచ్చినట్లుగా, తాము తిరిగి పుంజుకుంటామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీ స్వంత పార్టీకి సున్నా సీట్లు అందించడం మరియు తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు బహుమతిగా ఇవ్వడం ద్వారా మీరు సాధించిన అద్భుతమైన విజయానికి మేము కూడ బీఆర్ఎస్ పార్టీని అభినందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు ఎవరైనా అర్హులైతే, అది మీరేనని, ఢిల్లీ లో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కి చాలా ఆనందం కలిగిస్తున్నట్టు ఉందన్నారు. లోలోపల చాలా సంతోషంగా ఉంటూ.. బీజేపీ కి మద్దతు గా నిలుస్తున్న కేటీఆర్, ఇదంతా కేసుల మాఫీ కోసమే అనే మాట నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అధికారం లో ఉన్నపుడు బీజేపీ అండ దండ తో ఇష్టానుసారం దోచుకుతిని అధికారం పోయాక కేసుల నుండి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారని విమర్శించారు.

Also Read: Chandrababu – Pawan Kalyan: అక్కడ పవన్.. ఇక్కడ చంద్రబాబు.. బీజేపీకి బూస్ట్ ఇచ్చారా?

దేశాన్ని ఏలుతాం అని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయం లో ఏడ పోయింది? ఆనాడు మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ గెలిస్తే ఇదే విధంగా శునకానందం బీఆర్ఎస్ పొందిందని, బీజేపీ – బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయలేనిదని, సమస్త తెలంగాణ ప్రజలకి తెలిసింది.. ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ తో దేశ వ్యాప్తంగా తెలిసిందని మంత్రులు ట్వీట్ చేశారు. మొత్తం మీద దారిన పోయే కంపను కేటీఆర్ ఒక్క ట్వీట్ తో తగిలించుకున్నారని నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×