Trigrahi Yoga 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల చివరలో అరుదైన గ్రహ సంయోగం ఏర్పడనుంది. మార్చి 29న లో అతిపెద్ద రాశి మార్పు జరగబోతోంది. శని కుంభరాశిలో తన ప్రయాణాన్ని నిలిపివేసి.. బృహస్పతి రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే కాకుండా.. ఈ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. మీన రాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, రాహువు గ్రహాలు ఇప్పటికే కలిసి ఉన్నాయి.
మార్చి 29న శని రాశి మారనున్నాడు. మీన రాశిలో శని, శుక్రుడు, రాహువుల వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రహి యోగం వల్ల.. 12 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు అందుతాయి. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు ఈ గౌరవం లభిస్తాయి. మరి త్రిగ్రాహి యోగం వల్ల ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
శని సంచార సమయంలో రాహువు, శని, శుక్రుడి సంయోగం మిథున రాశి వారికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ త్రిగ్రహి యోగం మిథున రాశి కర్మ భావంలో ఏర్పడబోతోంది. ఇలాంటి సమయంలో మీరు మీ వృత్తి, వ్యాపారంలో మంచి విజయాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అంతే కాకుండా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ , వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీ పనికి ప్రశంసలు కూడా లభిస్తాయి.
ఆర్థిక లాభం పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీరు ఎప్పటికప్పుడు శుభవార్త వింటూనే ఉంటారు. మీ గౌరవం, కీర్తి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
కుంభ రాశి :
త్రిగ్రహి యోగం ఏర్పడటం వల్ల కుంభ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ త్రిగ్రహి యోగం మీ జాతకంలో రెండవ ఇంట్లో.. అంటే సంపద స్థానంలో ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఆర్థిక పరంగా చాలా లాభాలు కలుగుతాయిజ అంతే కాకుండా వృత్తి, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. అంతే కాకుండా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసుల్లో మీ కష్టానికి తగిన ఫలాలు పొందుతారు.
Also Read: షష్టగ్రహ కూటమి.. మార్చి 29 నుండి వీరి తలరాతలు మారిపోతాయ్ !
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి.. రాహువు, శని, శుక్రుడి సంయోగం వల్ల ఏర్పడిన త్రిగ్రహి యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఏర్పడబోతోంది. ఇది మీ విలాసాలు , సౌకర్యాలను పెంచే అవకాశం ఉంది. మీ ఆర్థిక లాభం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయాలు మీకు లాభాలను అందిస్తాయి. అంతే కాకుండా మీ అదృష్టం పెరుగుతుంది. దీని కారణంగా పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుండి కూడా మీరు ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక సంబంధం కూడా సంతోషంగా కొనసాగుతుంది. ఆర్థిక పరంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటారు.