Gandhi Thatha Chettu OTT : ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి (Sukriti Veni) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సుకృతి తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి మూవీనీ ప్రమోట్ చేస్తూ కనిపించింది. మరి ‘గాంధీ తాత చెట్టు మూవీ’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? సుకృతి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘గాంధీ తాత చెట్టు’కు సుకృతి బెస్ట్ ఫ్రెండ్ ప్రమోషన్స్
పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకి సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గాంధీజీ సిద్ధాంతాన్ని అనుసరించే అమ్మాయిగా, తన ఊరిని కాపాడుకోవడానికి ఓ అమ్మాయి చేసిన ప్రయత్నం ఏంటి? అనే కథను ఈ మూవీలో చూపించారు. ఈ మూవీని దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి.
ఈ ఏడాది జనవరి 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సుకృతి తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి మూవీని ప్రమోట్ చేస్తూ కనిపించింది. సుకుమార్ కూతురు సుకృతి, మహేష్ బాబు తనయ సితార (Sitara Ghattamaneni ) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి చాలా కాలం నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ‘గాంధీ తాత చెట్టు’ సినిమాను రిలీజ్ కి ముందే సితారకు చూపించారు. ఇక సుకృతితో కలిసి సితార ఓ ఇంటర్వ్యూ కూడా చేద్దామనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు సుకృతితో కలిసి ఈ మూవీని ప్రమోట్ చేస్తూ కనిపించింది సితార.
రెండు ఓటీటీలలో ‘గాంధీ తాత చెట్టు’
ఇదిలా ఉండగా ‘గాంధీ తాత చెట్టు’ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ, ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఆదివారం నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ మొదలైంది.
నిజామాబాద్ జిల్లా అడ్లూరులో జరిగే స్టోరీ ఇది. గాంధీజీకి గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో రామచంద్రయ్య ఓ చెట్టు నాటుతాడు. అందులోనే తన ప్రాణం ఉందని చెప్పే రామచంద్రయ్య తన మనవరాలికి గాంధీ సిద్ధాంతాల్ని నూరిపోస్తాడు. పైగా అమ్మాయి అయిన మనవరాలికి గాంధీ అని పేరు పెడతాడు. ఆ తర్వాత ఒకరోజు సడన్ గా రామచంద్రయ్య తన భూమికి, చెట్టుకు దూరమయ్యే సిచువేషన్స్ వస్తాయి. దీంతో తాత ప్రాణప్రదంగా భావించే చెట్టును కాపాడడానికి చిన్నారి పూనుకుంటుంది. మరి గాంధీజీ సిద్ధాంతాలతో శాంతియుతంగా చేసిన ఆమె పోరాటం ఫలితం ఏంటి? చివరికి తన తాత ఇష్టపడే చెట్టుని కాపాడగలిగిందా? అనేది స్టోరీ.
#GandhiTathaChettu ni ipudu @PrimeVideoIN lo chuseyandi🥳😍 cutie pie ❤️ pic.twitter.com/ZACqKmLbnz
— Pakka Mahesh Pilla 🖤💫 (@Vanaja_prince) March 25, 2025