BigTV English

Raw Mango: పచ్చి మామిడితో వెయిట్​ లాస్​..

Raw Mango: పచ్చి మామిడితో వెయిట్​ లాస్​..

Raw Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మామిడిపండ్లే. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. వేసవికాలం అయిపోయేంత వరకు దొరికే మామిడిపండ్లను కొనుక్కుని లాగించేస్తుంటారు. బయట ఎండ వేడికి చల్లటి మామిడి కాయలను తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మామిడి పండ్లను కేవలం ఆస్వాదించడానికే కాకుండా.. వీటితో చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయని సాధారణంగా చాలా మందికి తెలియదు. మామిడిపండ్లను ఐస్ క్రీం, స్వీట్స్, జ్యూస్, ఇంకా ఫేస్ మాస్క్ వంటి వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కానీ మామిడిపండ్లతో ఆరోగ్యానికి కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.


మామిడిపండ్ల కంటే మామిడి కాయలతో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మామిడికాయలను పచ్చడి, పప్పులు వంటి వాటివి ఉపయోగిస్తుంటారు. మామిడి పండు కంటే మామిడి కాయను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల శరీర బరువును తగ్గించుకునే అవకాశాలు ఉంటాయట. మామిడికాయల్లో ఉండే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ఇది తోడ్పడుతుంది. చర్మ వ్యాధులను తగ్గించుకోడానికి కూడా పచ్చి మామిడికాయ ఉపయోగపడుతుంది.

Weight loss with Mango
Weight loss with Mango

Also Read: నాన్​ స్టిక్​ పాత్రల్లో ఇవి అస్సలు వండకూడదు..?


వేసవిలో లభించే మామిడికాయలు శరీరంలోని ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుచుతుంది. పండు మామిడి కంటే పచ్చి మామిడి కాయను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా మామిడి కాయ చాలా ఉపయోగపడుతుంది. మామడికాయలో తక్కువ కేలరీలు, మంచి ఫైబర్ ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహకరిస్తుంది. ఇక వడదెబ్బ వంటి ప్రమాదాల నుంచి కూడా మామిడికాయ కాపాడుతుంది. మామిడి కాయ తినడం వల్ల శరీరంలోని టెంపరేషన్ ను తగ్గించుకోవచ్చు.

Tags

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×