Indian Origin: జర్మన్ పార్లమెంట్‌లో తెలుగోడి ఫోటో.. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలోనూ దర్శనమిస్తున్న అదే ఫోటో.. 9 దశాబ్దాలుగా జర్మన్ల గుండెల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ వ్యక్తికి?? జర్మకు ఉన్న అనుబంధం ఏంటి..? నియంతృత్వానికి పరాకాష్టగా ఉన్న జర్మన్లు ఆ వ్యక్తికి ఎందుకు అంత గౌరవం ఇస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీల చేతే దండాలు పెట్టించుకున్న ఒకే ఒక్క ధీరుడు మన తెలుగు వీరుడు. విశ్వవిజేతగా నిలవాలనుకున్న నియంత హిట్లర్ చేత కొనియాడబడిన మహోన్నత వ్యక్తి మన తెలుగు తేజం. మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీ దేశానికి పునర్‌వైభవం తీసుకురావాలని శపథం చేసిన హిట్లర్ నే మెప్పించిన తెలుగు పండితుడు. తమ జాతిని మించిన జాతి ప్రపంచంలో లేదని గుడ్డిగా నమ్మే నాజీలు సైతం సెల్యూట్ చేసిన మేరునగధీరుడు మన తెలుగు వ్యక్తి ఎవరో కాదు బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి. ఈ పేరు ఇప్పటికిప్పుడు మనదేశంలో ఎవరినైనా అడిగితే తెలియదు అనే సమాధానం వస్తుంది కానీ ఇంకో వందేళ్ల తర్వాత జర్మనీలో అడిగినా ఆయన పుట్టపూర్వోత్తారాలే కాదు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటారు నాజీలు.
ఎవరీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి:
దండిభట్ల విశ్వనాధ శాస్త్రి స్వస్థలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి. ఆయన చిన్నప్పటి నుంచి వ్యాకరణంలోనే కాకుండా వేదాలను ఔపోసన పట్టారు. అదే ఆయనను జర్మనీ దాకా వెళ్లేలా చేసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వ్యాకరణ శాస్త్రంలో ఎవరైనా దిట్ట ఉన్నారంటే అది విశ్వనాథ శాస్త్రి అని చెప్పేవారు. అంతటి మహానుబావుడు కాబట్టే సాక్ష్యాత్తు హిట్లర్ లాంటి వాడే ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి జర్మనీకి స్వాగతం పలికాడు.
హిట్లర్‌కు శాస్త్రి గారిపై ఎందుకు గురి :
మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీ ఓడిపోయాక ఆ దేశానికి ఎలాగైనా పునర్‌వైభవం తీసుకురావాలనుకున్నాడు హిట్లర్ అందుకోసం నియంతగా మారి ప్రపంచంపై దండెత్తడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడు జర్మనీలో బాంబులు తయారు చేస్తుంటే విపత్తులు సంభవించేవి. దీంతో హిట్లర్‌కు వ్యాకరణం, వేదాలు తెలిసిన వ్యక్తి అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని అలాగే వేద శాస్త్రంలో కొత్త రకమైన మారణాయుధాలు ఎలా తయారో చేయోచ్చు కూడా ఉంటుందని.. ఎవరో చెప్పారట. అది విన్న హిట్లర్ వ్యాకరణ శాస్త్రం, వేదాలు తెలిసిన వ్యక్తి కోసం తన మనుషులతో మన దేశంలో వెతికించడం మొదలు పెట్టాడట.
అలా హిట్లర్ మనుషుల దృష్టిలో పడ్డారు విశ్వనాథ శాస్త్రి. ఒకరోజు విశాఖపట్నం వెళ్లిన దండిభట్లను హిట్లర్ మనుషులు అటు నుంచి అటే ఆయనను కలకత్తా తీసుకెళ్లి అక్కడి నుంచి జర్మనీ తీసుకెళ్లారట. ఆయన జర్మనీ వెళ్లిన వెంటనే.. అక్కడ బాంబులు తయారు చేసే కర్మాగారంలో ప్రమాదాలు జరగకుండా తనకు తెలిసిన యజుర్వేదం లోంచి పరిష్కారం సూచించారట. దీంతో విశ్వనాథ శాస్త్రి పేరు మొదటిసారి జర్మనీ అంతటా మారుమోగిందట. ఇక అప్పటి నుంచి తన తెలిసిన వేదాలు, వ్యాకరణ శాస్త్రం ద్వారా జర్మనీ అభివృద్ది ఎన్నో రకాలుగా సహాయం చేశారట. ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇప్పటికీ ఆ దేశ పార్లమెంట్‌లో అలాగే ఆ దేశ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి కార్యాలయంలోనూ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి ఫోటో ఉంటుంది.
ఆశ్చర్యపోయిన రాయబారి:
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జర్మనీలో మన దేశ రాయబారిగా వెళ్లిన వ్యక్తికి అక్కడి అధికారులు దండిభట్ల ఫోటో చూపించి ఎవరో తెలుసా అని అడిగారట. ఆ రాయబారి తెలియదని చెప్పడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యపోయి ఆయన భారతీయుడని తెలుగు వ్యక్తి అని చెప్పారట. ఇంకా ఆయన చేసిన సేవలను కొనియాడారట. దీంతో అప్పటి వరకు తనకు తెలియని దండిభట్ల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోవడం మన రాయబారి వంతైందట.
జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి మన దేశానికి రాలేదు. అయితే ఆయన సతీమణికి మాత్రం జర్మనీ నుంచి నెలకు మూడు వందల రూపాయలు మనీ ఆర్డర్ వచ్చేదట. కొద్ది రోజులు తర్వాత నెలకు 90 రూపాయలు వచ్చాయట. అంటే ఆయన బతికి ఉన్నన్ని రోజులు మూడు వందలు..ఆయన చనిపోయిన తర్వాత అక్కడి ప్రభుత్వం తరపున 90 రూపాయలు వచ్చి ఉండొచ్చట.
దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా ఇప్పటికీ స్మరించుకోవడం విశేషం. మన దేశ ఔనత్యాన్ని పరాయి దేశంలో వెలిగించిన మహానుభావుడు దండిభట్ల.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?