E-Paper
Advertisement

Budh Asta: జూన్ 2 నుండి ఈ రాశులపై బుధుడి ప్రభావం.. ప్రమాదాలు, ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు

Budh Asta: జూన్ 2 నుండి ఈ రాశులపై బుధుడి ప్రభావం.. ప్రమాదాలు, ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు
Advertisement

Budh Asta: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మార్చుతూనే ఉంటుంది. అయితే గ్రహాల స్థానంలో మార్పులు అనేవి మొత్తం 12 రాశుల మీద పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలోనే రాబోయే జూన్ 2వ తేదీన బుధ గ్రహంలో మార్పులను సంభవించనున్నాయి. బుధుడు వృషభరాశిలో అస్తమించిన తర్వాత జూన్ 29న సంచారం ప్రారంభిస్తాడు. ఈ తరుణంలో బుధ గ్రహం స్థానం మారడం వల్ల 3 రాశుల వారికి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆర్థికంగా నష్టం, వృత్తిలో సమస్యలను ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి. ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఏ రాశులపై బుధుడి ప్రభావం ఉంటుందో వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశి గల వ్యక్తులు జూన్ 2 నుండి జాగ్రత్తగా ఉండాలి

Advertisement

1. తుల రాశి:

బుధుడు అస్తమించడం వల్ల తుల రాశి వారికి సమస్యలు ఎదురుకావచ్చు. అంతేకాదు ఆరోగ్యపరంగా కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. శత్రువుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఖర్చు పెట్టకండి.

Advertisement

2. వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి బుధుడు అస్తమించడం వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉండదు. చేస్తున్న పని కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. పనిలో అడ్డంకుల కారణంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కెరీర్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా పని చేసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

3. మీన రాశి:

మీన రాశి వారికి బుధుడు అస్తమించడం వల్ల చెడు ప్రభావం ఉంటుంది. ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితం కావచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, లేకుంటే ప్రమాదం జరగవచ్చు. శని సాడే సతి ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంది. ఇది ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×