BigTV English

Naga Vamsi: నిర్మాత నాగవంశీ ఇంట తీవ్ర విషాదం

Naga Vamsi: నిర్మాత నాగవంశీ ఇంట తీవ్ర విషాదం

Naga Vamsi Grand Mother Passed Away: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట తీవ్ర విషాదం. సినీ నిర్మాతగా ఎంతో పేరుగాంచిన రాధాకృష్ణ మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) ఇవాళ (మే 30)న మధ్యాహ్నం 3 గంటలకు హృదయ సంబంధింత వ్యాధితో తుది శ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సంతానం. అందులో రాధాకృష్ణ రెండవ కుమారుడు. అయితే సూర్యదేవర నాగేంద్రమ్మ ఎవరో కాదు. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి నాయనమ్మ. ఆమె అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని విద్యుత్ స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


కాగా నాగవంశీ రాధాకృష్ణ (చినబాబు) హారికా హాసిని బ్యానర్‌ను మొదలు పెట్టి ఎన్నో హిట్ సినిమాలను నిర్మించి అదరగొట్టారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు నాగవంశీ కూడా తన తండ్రి రాధాకృష్ణ మాదిరిగానే ఎన్నో హిట్ సినిమాలను నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

అయితే ప్రస్తుతం నాగవంశీ నిర్మిస్తున్న కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.


Also Read: బాలయ్య బాబు మందు తాగలేదు.. అవన్నీ గ్రాఫిక్స్ చేశారు: నాగవంశీ

అయితే రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో బాలయ్య నటి అంజలిని నెట్టేయడం.. అలాగే బాలయ్య కాళ్ల దగ్గర మందు బాటిళ్లు ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వీటిపై నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఏది ఏమైనా నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రేపు అంటే మే 31న రిలీజ్ కానుండగా.. ఒక్క రోజు ముందు నిర్మాత నాయనమ్మ మరణించడం గమనార్హం.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×