ఎవరి జాతకంలోనైనా శని ఉన్నత స్థానంలో ఉంటే ఆ రాశి జాతకుడు మంచి స్థాయికి వెళతారని చెబుతారు. అలాగే కొన్నిసార్లు గ్రహ స్థితులు మారడంతో పాటు శని మారుతున్న రాశిని బట్టి కూడా జాతకులకు మేలు జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శని ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. 2027 సంవత్సరం వరకు ఆ రాశిలోనే ఉంటాడు. ఎందుకంటే శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం.
2027వ సంవత్సరం వరకు శని అనేక గ్రహాలతో సంయోగం చెందుతూ అనేక రాజయోగాలను ఏర్పరుస్తాడు. ఆ యోగాలు కొందరికి మేలు చేస్తే మరి కొందరికి కీడు చేస్తాయి. అయితే ఈరోజు నుంచి శని నవపంచమ రాజయోగంతో ఎన్నో మార్పులకు కారకుడు అవుతాడు. శని, సూర్యుడు ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటారు. దీనివల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. జూలై 24 నుంచి ఏర్పడే ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
శని, సూర్యుడు వల్ల ఏర్పడే నవ పంచమ రాజయోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ మూడు రాశులలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
మేషరాశి
నవ పంచమ రాజయోగం వల్ల మేష రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వారి జీవితంలో ఎంతో మంచి పురోగతిని చూస్తారు. చేస్తున్న ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే జీతం కూడా పెరగవచ్చు. మీ ప్రత్యర్థులతో మీరు విజయాన్ని అందుకుంటారు. మీతో ఎవరికీ పోటీ ఉండదు.
తులా రాశి
తులా రాశి వారికీ నవ పంచమ రాజయోగం బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. తులారాశి వారు చేసిన కష్టానికి ఫలితం లభిస్తుంది. విజయం వారి దగ్గరకే వస్తుంది. వారి మతపరమైన కార్యా కలాపాలపై వారికి ఆసక్తి ఎంతో పెరుగుతుంది. సంతృప్తికరమైన ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సమాజంలో, కుటుంబంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఎంతో పురోగతి కనిపిస్తుంది.
వృశ్చిక రాశి
నవ పంచమ రాజయోగం వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఎంతో సహాయం చేస్తుంది. వారి జీవితంలో విలాసం, ఆనందం కలుగుతాయి. కెరీర్ పరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలను చవిచూసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పెద్ద శుభవార్తలే వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఇక వైవాహిక జీవితంలో ఆనందం వెళ్లి విరుస్తుంది.