Big Stories

Sri Rama Navami Prasad: రామ నవమికి బాలరాముడి భక్తులకు మహా ప్రసాదం.. లక్ష మఠాడీల నైవేద్యం!

Sri Rama Navami Prasad: శ్రీ రామనవమికి దేశం ముస్తాబవుతోంది. మరో రెండు రోజుల్లో రానున్న శ్రీ రాముడి కళ్యాణం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ జన్మభూమిలోని బాలరాముడి సన్నిధిలో కళ్యాణం కోసం అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ట్రస్టు సిబ్బంది ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే రామనవమికి మహా ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని నాథ్ ద్వారాలోని శ్రీనాథ్‌జీ అనే పురాతనమైన శ్రీ కృష్ణుడి ఆలయం నుంచి తొలిసారి మఠడీ అనే మహాప్రసాదం రాముల వారి సన్నిధిలో చేరనుంది.

- Advertisement -

ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నాడు శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. అయోధ్యలోని బాలక్ రాముడికి మఠడీ ప్రసాదాన్ని సమర్పించిన అనంతరం గుడిలోని బాలరాముడి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఈ క్రమంలో లక్ష మఠడీల మహా ప్రసాదాన్ని అయోధ్యకు పంపనున్నట్లు శ్రీనాథ్ జీ ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే మఠడీ పేరుతో ఉండే ప్రసాదాన్ని శ్రీకృష్ణుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. దీనిని మరే ఆలయంలో కూడా తయారుచేయరు. దీనిని గోధుమపిండి, పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచదార పాకంతో తయారుచేస్తారు. ఈ మఠడీ ప్రసాదం పాడవక్కుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.

- Advertisement -

Also Read: తులసి మొక్క.. ఏ దిక్కులో పెడితే లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందో తెలుసా ?

మఠడీ మహాప్రసాదాన్ని శ్రీరామనవమి వేడుకలకు అయోధ్యకు చేరుకోనుంది. ఇవి యాత్ర భిల్వారా, జైపూర్, మథుర జాతిపుర, లఖ్‌నవూ మీదుగా అయోధ్యకు చేరుకోనుంది. దీనిని శ్రీనాథ్ ఆలయంలో ఉచితంగా ప్రసాద పంపిణీ చేయనున్నారు. దాదాపు 11వేల మఠడీలను భక్తులకు పంపిణీ చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే జనవరిలో ప్రారంభమైన తొలి శ్రీ రామనవమికి దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దాదాపు 560 సీసీటీవీ కెమెరాలతో ఆలయ పరిసరాలను కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ఇక రామనవమి ఏర్పాట్లలో భాగంగా భద్రత దృష్ట్యా నేటి నుంచి దర్శనాలకు రద్దు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News