జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలంటే సరైన మార్గంలో నడవాలి. అందుకే గరుడ పురాణం తరచూ చదవమని హిందూ మతంలో చెబుతూ ఉంటారు. గరుడ పురాణాలలో మానవునికి మరణానంతరం ఉండే జీవితంలో ప్రతి దాని గురించి ఒక వివరణ ఉంటుంది. అవి కర్మ ఫలాలు కావచ్చు లేదా పాపానికి శిక్షలు కావచ్చు. జీవించి ఉన్నప్పుడు చేసిన తప్పులు మరణానంతరం శిక్షలుగా మారతాయి. గరుడ పురాణంలో దాదాపు 28 రకాల శిక్షలు, నరకాలు ఉన్నాయి.
తమిస్రం
ఒకరి భావాలతో ఆడుకోవడం, ఒకరిని మోసం చేయడం, ఇతర వస్తువులు దొంగిలించడం వంటి వ్యక్తులు మరణానంతరం తమిస్రంలోకి వెళతారు. వారు తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపడే వరకు కూడా దెబ్బలు తింటారు. అక్కడ ఆత్మలునువ్వు కట్టివేసి ఉంచుతారు. కొరడాతో కొడుతూ ఉంటారు. విశ్రాంతి ఉపసనం వంటివి ఉండవు.
రౌరవం
యమరాజుకు చెందిన మనుషులు ఇక్కడ శిక్షలు వేస్తూ ఉంటారు. దొంగతనం చేసే వారికి ఇతరులకు సంపద, ఆస్తి వనరులు వంటివి లాక్కున్నవారికి రౌరవం అనే శిక్షను వేస్తారు. ఇందులో పాముల్లా కనిపించే యమ భటులు శిక్షిస్తారని చెప్పుకుంటారు.
కుంభీపాకం
హిందూమతంలో ప్రజలు మాంసం తినకూడదని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ ఎంతో మంది ఇష్టంగా మాంసాహారాన్ని తింటారు. బతికి ఉన్న జంతువులను చంపి తినేవారికి మరణానంతరం కుంభీపాకం నరకానికి పంపుతారని అంటారు. అక్కడ వేడి నూనెలో వేసి వేయిస్తారని చెప్పుకుంటారు.
కాలసూత్రం
ఒకరిని అగౌరవం పరచడం విపరీతమైన కోపంతో ప్రవర్తించడం, పెద్దలను గౌరవించకపోవడం, వారిని తిట్టడం, ఉద్రేకపూరితమైన పనులు చేయడం వంటివి చేసిన వారు కాలసూత్రానికి వెళతారు. కాలసూత్రం అనే ప్రదేశం వేడిగా ఉండే ప్రాంతం ఇందులో పాపిని పరిగెత్తిస్తారని చెప్పుకుంటారు.
అంధకూపం
మీరు అవకాశం ఉండి కూడా ఎవరికీ సహాయం చేయకపోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం వంటి వారు అంధకూపం నరకానికి వెళతారు. అంధకూపంలో అడవి జంతువులు, కీటకాలు, సరిసృపాలు అధికంగా ఉంటాయి. అక్కడ పాపులపై దాడి చేస్తాయి.
విషసనం
అసూయతో, గర్వంతో జీవించే వ్యక్తులు, ఇతరులను చిన్నచూపు చూసే వ్యక్తులు మరణానంతరం వెళ్లే ప్రదేశమే విషసనం. ఈ స్థలం ఇతరులను దూషించే వారికి, అగౌరవపరిచేవారికి కేటాయించినది. ఇక్కడ పాపులను యమభటులు తీవ్రంగా కొట్టి హింసిస్తారు.
సారమేయాసనం
ఇతరులను మోసం చేయడం, వారి ఆస్తులను దొంగిలించడం వంటి వారు సారమేయాసనానికి వెళతారు. ఈ నరకంలో పాపులను ఆకలితో ఉన్న కుక్కల చేత కరిపిస్తారు.
గరుడ పురాణం చదివేవారు తప్పులు తక్కువ చేస్తారని, వారికి మరణానంతర జీవితంపై భయం ఉంటుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరినీ గరుడ పురాణం చదవమని చెబుతారు.
Also Read: వసంత పంచమి రోజు ఈ పనులు చేయకూడదు.. సరస్వతీ మాతకు కోపం వస్తుంది