Nindu Noorella Saavasam Serial Today Episode : పెద్ద మనసుతో నన్ను నా కుటుంబాన్ని కాపాడిన నా అన్నయ్యను శిక్షించకండి.. ఫ్లీజ్ మా అన్నయ్యను వదిలేయండి. అని ఆరు యముడిని వేడుకుంటుంది. ఆరు మాటలకు గుప్త ఎమోషనల్ అవుతాడు. ఇంతలో యముడు విచిత్రగుప్తుడిని వదిలేయండి అని భటులకు చెప్పగానే.. వదిలేస్తారు.
అమర్ హాల్లోకి వచ్చి మిస్సమ్మను పిలుస్తాడు. బయటి నుంచి మిస్సమ్మ వస్తుంది. ఎక్కడికి వెళ్లావు మిస్సమ్మ.. ఇంతసేపు ఫోన్ కూడా ట్రై చేశాను బిజీ వచ్చింది. ఏమైంది డల్లుగా ఉన్నావు.. హెల్త్ ఓకేనా..? మిస్సమ్మ ఏమైంది పలకవు.. అంటాడు. వెనక నుంచి శివరాం ఏమీ చెప్పొద్దని సైగ చేస్తుంటాడు. ఇంతలో మనోహరి వచ్చి ఏమైంది మిస్సమ్మ.. అమర్ అడుగుతుంటే.. పలకవేంటి..? అంటుంది. దీంతో ఎక్కడికి వెళ్లావు.. మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. అమర్ నువ్వు రణవీర్‌కు ఫోన్ చేసి అంజును ఎప్పుడు తీసుకొస్తాడో కనుక్కో అని చెప్తుంది.
సరే అని అమర్ ఫోన్ చేయబోతుంటే.. రణవీర్, అంజును తీసుకుని వస్తాడు. అమర్‌కు థాంక్స్ చెప్పి నేను ఇక వెళ్తాను అని చెప్తాడు. అంకుల్ అప్పుడే కోల్‌కత్తా వెళ్తారా..? అని అడుగుతుంది అంజు. లేదమ్మా.. వచ్చిన పని ఇప్పుడే మొదలైంది. పని అయిపోయే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అయితే మా ఇట్లోనే ఉండండి అంటుంది అంజు. అమర్ కూడా ఇక్కడే ఉండండి అని చెప్పగానే.. రణవీర్ సరే అంటూ లోపలికి వెళ్తాడు.
ఆరు ఏడుస్తూ ఉంటే గుప్త వచ్చి ఏమిటి బాలిక నువ్వు చేసిన పని నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లుటకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనుకుంటివి అని అడుగుతాడు. మీ చిత్రగుప్తుల వారికి నన్ను యమలోకానికి క్షణం పట్టింది గుప్త గారు. నాకు తెలిసి మీకు కూడా అంతే టైం పట్టొచ్చు కానీ ఏనాడు నాకు కష్టం కలిగించలేదు. ఆరోజు మీరు నా కోసం నిలబడ్డారు. ఈరోజు నేను మీ కోసం నిలబడ్డాను అంటుంది ఆరు. మాకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి నీవు కోరి కష్టములు తెచ్చుకుంటివి. నీ పిల్ల పిచ్చుకను తీసుకెళ్లుటకు సన్నాహాలు మొదలు పెట్టిరి.. నీవు ఇక్కడ ఉంటే నీ పిల్ల పిచ్చుకలను ఎవరు కాపాడతారు అంటాడు గుప్త. నా చెల్లెలు భాగీ ఉంది గుప్తగారు. తను కాపాడుతుందని నమ్మకం వచ్చింది. పర్వాలేదు గుప్త గారు. ఇక్కడ ఉండుటకు అలవాటు చేసుకుంటాను అని చెప్తుంది ఆరు. ఇంతలో గుప్త బాలిక నువ్వు తిరిగి భూలోకం వెళ్లుటకు ఒక్క అవకాశం ఉంది అని గుప్త చెప్పగానే.. ఎలా వెళ్లగలను.. నన్ను ఎవరు తీసుకెళ్లగలరు అని అడుగుతుంది. మా చిత్రగుప్తుల వారే నిన్ను తీసుకెళ్లెదరు అంటూ ఆరు ఏం చేయాలో చెప్తాడు గుప్త.
రూంలో పిల్లలతో ఆడుకుంటున్న అంజు.. రణవీర్ షాపింగ్ చేయించిన విషయాలు చెబుతూ..హాస్పిటల్‌కు వెళ్లిన విషయం చెప్తుంది. ఇంతలో డోర్ దగ్గరకు వచ్చిన మిస్సమ్మ వింటుంది. కోపంగా లోపలికి వచ్చి అంజు చెకప్ ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు అని చెప్తుంది అంజు. దగ్గరకు వెళ్లి అంజు చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి ఇదేంటి అని అడుగుతుంది. ఊరుకే వేసుకున్నాను అని చెప్తుంది అంజు. మరి ఇందాక చెకప్ అన్నావు అని మిస్సమ్మ అడిగితే.. చెకప్ కాదు మేకప్ అన్నాను మాల్ లో ట్రైయల్ మేకప్ వేసుకున్నాను అయినా బయటి నుంచి అలసిపోయి వస్తే.. ఈ ప్రశ్నలేంటి మిస్సమ్మ అంటూ వెళ్లిపోతుంది.
మనోహరి లాన్‌లో ఆలోచిస్తుంటే.. రణవీర్ వస్తాడు. ఎందుకు ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నావు అని కోపంగా అడుగుతుంది మనోహరి. అంజుకు దగ్గరగా ఉండొచ్చని ఒప్పుకున్నాను.. అయినా అమర్ రెండు రోజుల వరకు రాడని చెప్పావు మరేంటి అప్పుడే వచ్చాడు అని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు అంటుంది మనోహరి. అయితే అంజును ఎలా తీసుకెళ్లాలి.. లేదంటే కిడ్నాప్ చేద్దామా అంటాడు రణవీర్. ఇంతలో మిస్సమ్మ వచ్చి వాళ్లు మాట్లాడుకునేది వింటుంది. మిస్సమ్మను రణవీర్ చూసి షాక్ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?