OTT Movie : హాలీవుడ్ సినిమాలలో బెస్ట్ సినిమాలు చాలానే ఉంటాయి. వీటిలో బెస్ట్ మూవీగా, ఒక మూవీ రికార్డులు తిరగా రాసింది. 1994 లో వచ్చిన ఒక మూవీని, ఇప్పటికీ హాలీవుడ్ సినిమాలలో బెస్ట్ మూవీగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ది షాషాంక్ రిడంప్షన్‘ (The Shawshank Redemption). స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ మూవీ నిర్మించబడింది. ఈ మూవీకి ఫ్రాంక్ డేరా బన్ట్ దర్శకత్వం వహించాడు. రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఒక వ్యక్తి సాగించిన జీవితం ఈ చిత్ర కథాంశం. సినీ చరిత్రలో ఒకానొక గొప్ప అత్యంత ఉత్తేజపూరితమయిన మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తన భార్యతో పాటు ఆమె ప్రియుడిని కూడా చంపాడని కోర్టులో రుజువు అవుతుంది. అందుకుగాను హీరోకి జైలు శిక్ష కూడా పడుతుంది. జైలుకు వెళ్లిన హీరో అక్కడ పరిస్థితులకు అలవాటు పడిపోతాడు. ఆ జైలు చాలా దారుణంగా ఉంటుంది. అందులో ఉండే వార్డెన్ మరింత దారుణంగా ఉంటాడు. హీరోకి అందులోనే 20 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న రెడ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితోనే ఎక్కువగా మాట్లాడుతుంటాడు హీరో. జైలు వార్డెన్ కి ఒకసారి ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకుంటాడు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో హీరో వార్డెన్ కి చెప్తాడు. బ్యాంకింగ్ లో పనిచేసిన ఇతనికి ఆ విషయాలు బాగా తెలుసు. అప్పటినుంచి వార్డెన్ హీరోని ఉపయోగించుకుని, తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ గా చేసుకుంటూ ఉంటాడు. హీరోని కూడా ఆ వార్డెన్ లైబ్రరీలో పనికి పెడతాడు. అలా ఒకరోజు వీళ్ళతో కలిసిమెలిసి ఉన్న ఒక వృద్ధుడు 50 సంవత్సరాల తర్వాత విడుదలవుతాడు. బయటికి వెళ్లి ఈ వయసులో ఎలా బతకాలని భయపడుతూ వెళ్తాడు. ఈ మూవీలో ఈ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. బయట ఆ వృద్ధుడు బతకలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయం హీరో వాళ్లకు తెలిసి బాగా బాధపడతారు.
ఆ తర్వాత హీరో ఆ నేరం చేయలేదని, జైల్లో ఉండే ఒక వ్యక్తి చేశాడని తెలుసుకుంటాడు. ఈ విషయం వార్డెన్ కి చెప్తుంటే, అతన్ని చీకటి గదిలో బంధిస్తాడు. ఎందుకంటే వార్డెన్ రహస్యాలు హీరోకి మాత్రమే తెలుసు. అతడు బయటికి వెళ్తే తన విషయాలు చెప్తాడని అనుమానపడతాడు. ఇలా హీరో 20 సంవత్సరాలు గడుపుతాడు. ఒకరోజు హీరో ఆ జైలు నుంచి తప్పించుకొని పారిపోతాడు. నిజానికి పారిపోవడానికి అతడు 20 సంవత్సరాలు కష్టపడతాడు. ఒక చిన్న ఇనుప ముక్కతో గోడకు రంధ్రం చేసి, ఆ మట్టిని జేబులో వేసుకొని, ఎవరికి తెలియకుండా బయట పడేస్తూ ఉంటాడు. అలా తప్పించుకున్న హీరో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. వార్డెన్ బ్లాక్ మనీని తన అకౌంట్లోకి మార్చుకుంటాడు. ఆ తర్వాత లైఫ్ని హ్యాపీగా గడుపుతాడు. ఈ మూవీని ఎవరైనా చూడకపోతే, ఈ వీకెండ్ ఒకసారి తప్పకుండా చూడండి.