BigTV English

OTT Movie : 24 గంటలకోసారి చచ్చి బతికే హీరో… టామ్ క్రూయిజ్ మైండ్ బెండింగ్ టైమ్ లూప్ మూవీ

OTT Movie : 24 గంటలకోసారి చచ్చి బతికే హీరో… టామ్ క్రూయిజ్ మైండ్ బెండింగ్ టైమ్ లూప్ మూవీ

OTT Movie : టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న హీరో లలో ఇతను కూడా ఒక్కడు. యాక్షన్ హీరోగా ఇతను చేసిన సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ మూవీలో కూడా ఈ హీరో అదరగొట్టాడు. టైమ్ లూప్‌ లో ఈ స్టోరీ నడుస్తుంది. ఇందులో ఏలియన్స్ ను ఎదుర్కునే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ పేరు ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’ (Edge of Tomorrow). 2014 లో వచ్చిన ఈ మూవీకి డగ్ లిమాన్ దర్శకత్వం వహించారు. టామ్ క్రూజ్, ఎమిలీ బ్లంట్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ భవిష్యత్తులో యూరప్‌ ను ఎక్కువ భాగం గ్రహాంతరవాసులు ఆక్రమిస్తారు. ఎలాంటి పోరాట అనుభవం లేని మేజర్ విలియం కేజ్, వీళ్ళను ఓడించడానికి ఒక మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో, అతను ఒక టైమ్ లూప్‌ లో చిక్కుకుంటాడు. ఈ టైమ్ లూప్‌ ద్వారా వాటిపై పోరాడుతాడు కేజ్. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మేజర్ విలియం కేజ్ ఒక పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఇతనికి యుద్ధ అనుభవం పెద్దగా ఉండదు. ఒకరోజు అనుకోకుండా భూమికి ఒక ప్రమాదం వస్తుంది. భూమిని ఒక శక్తివంతమైన ఏలియన్ జాతి ఆక్రమింస్తుంది. ఏలియన్స్ తో పోరాడేందుకు కేజ్ ను ఫ్రంట్‌లైన్‌లో పంపిస్తారు. అక్కడ జరిగే యుద్ధంలో కేజ్ ఒక ఏలియన్ ను చంపుతాడు. దాని రక్తం అతనిపై పడటంతో, అతను ఒక టైమ్ లూప్‌లో చిక్కుకుంటాడు. రోజూ అతను మరణిస్తూ బ్రతుకుతుంటాడు. ఆ తరువాత మళ్లీ అదే రోజు మొదలవుతుంది. ఈ లూప్‌లో, అతను రీటా వ్రతాస్కి అనే యోధురాలిని కలుస్తాడు. ఆమె గతంలో ఇలాంటి లూప్‌లో ఉండి, దాన్ని ఉపయోగించి ఏలియన్స్ ను ఓడించడం నేర్చుకుంది. రీటా సహాయంతో, కేజ్ తన యుద్ధ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటాడు.

ఈ ఏలియన్స్ ను ఓడించడానికి కీలకమైన ‘ఒమేగా’ అనే సెంటర్ పాయింట్ ను నాశనం చేయాల్సి ఉంటుంది. అది వాటికి నాడీ వ్యవస్తలా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతి లూప్‌లో కేజ్ కొత్త వ్యూహాలు నేర్చుకుంటూ, రీటాతో కలిసి ఏలియన్స్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. ఈ ఏలియన్స్ లోహపు శరీరాలతో, అసాధారణమైన వేగంతో చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇవి యుద్ధంలో చాలా ప్రమాదకరంగా మారుతాయి. చివరికి కేజ్ ఒమేగాను నాశనం చేస్తాడా ? టైమ్ లూప్‌ని బద్దలు కోడతాడా ?ఏలియన్స్ ను నియాంత్రిస్తాడా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : మొదటి రాత్రే పైకి పోయే పెళ్లి కొడుకు … ప్రియుడి ఆత్మతో గందరగోళం… మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×