Vastu Tips: రోజూ పని చేసి మంచిగా డబ్బు సంపాదించినా.. ఇంటి ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగుపడటం లేదు, డబ్బు ఎందుకు శాశ్వతంగా ఉండటం లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? మీ ఖర్చులు మీ ఆదాయం కంటే ఎక్కువ అవడం, ఇంట్లో ఒక్క పైసా కూడా ఉండకపోవడానికి కారణాలు చాలానే ఉంటాయి ఇంటి వాస్తు కూడా ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.
మీ ఇంట్లో సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని లోపలికి అనుమతించని కొన్ని వస్తువులు ఉంటే డబ్బు నిలవదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని కొన్ని వస్తువులు ఇంటి సానుకూల శక్తిని పాడు చేస్తాయి. ఫలితంగా ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. ఒక వేళ మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటే వాటిని వెంటనే బయట పడేయండి.
1. ఇంట్లో విరిగిన వస్తువులు :
మీ ఇంట్లో ఏవైనా విరిగిన పాత్రలు, అద్దం, గడియారం లేదా ఫర్నిచర్ పడి ఉన్నాయా ? అయితే ఇవి ప్రతికూల శక్తికి కేంద్రంగా మారతాయి. అలాంటి వాటిని వీలైనంత త్వరగా ఇంట్లోంచి బయట పడేయండి. ఇవి అడ్డంకులు, ఒత్తిడి, డబ్బు నష్టానికి కారణమవుతాయి. అంతే కాకుండా మీ సమస్యలకు కూడా కారణం అవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేలా చేస్తాయి. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
2. ఆగిపోయిన లేదా విరిగిన గడియారం:
మీ ఇంట్లో గడియారం ఆగిపోయినా లేదా తప్పు సమయం చూపించినా మీ జీవితంలో పురోగతి కూడా నిలిచిపోతుందని అర్థం చేసుకోండి. ఇంట్లో ఎప్పుడూ సరైన సమయాన్ని చూపించే గడియారం మాత్రమే ఉండాలి. ఆగిపోయిన గడియారాలు శక్తి స్తబ్దతను సూచిస్తాయి. ఆగిపోయిన గడియారం అంటే మీ సమయం సరిగ్గా గడవడం లేదని కూడా అర్థం. కాబట్టి.. ఇంట్లో ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి. ఆగిపోయిన గడియారాన్ని అస్సలు ఇంటో పెట్టుకోకండి.
3. విచారం లేదా ఒత్తిడి:
ఏడుస్తున్న పిల్లల చిత్రం, యుద్ధానికి సంబంధించిన ఫోటోలు లేదా గోడలపై అలసిపోయిన వ్యక్తుల చిత్రాలు ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. కాబట్టి.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. గోడలపై సానుకూలత, శ్రేయస్సును కలిగించే మంచి ఫొటోలను మాత్రమే ఉంచండి. లక్ష్మీ దేవి, నవ్వుతున్న పిల్లలు లేదా ప్రకృతి సౌందర్యం లేదా రాధా కృష్ణులకు సంబంధించిన ఫొటోలు ఇంట్లో ఉండటం మంచిది.
Also Read: ఏ నూనెతో దీపం పెడితే మంచిది ?
4. ముళ్ళ మొక్కలు:
కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు ట్రెండీగా కనిపిస్తాయి. కానీ అవి ఇంట్లో ఉద్రిక్తత, ఆర్థిక ఇబ్బందులను ప్రోత్సహిస్తాయి. ఇంట్లో శుభాన్ని కలిగించే మొక్కలను నాటండి. మనీ ప్లాంట్, వెదురు లేదా తులసి మొక్కలను నాటండి. ఇవి అందమైనవి మాత్రమే కాదు.. శ్రేయస్సుకు చిహ్నం కూడా.
5. మంచం కింద చెత్త :
మంచం కింద పడి ఉన్న పాత బూట్లు, పనికిరాని వస్తువులు లేదా ఇనుప వస్తువులు శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. మంచం కింద ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా అక్కడ శుభ్రమైన, ఉపయోగకరమైన వస్తువులను మాత్రమే ఉంచండి.