సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న అలల్లో ఎంజాయ్ చేయడాన్ని ఎంతో మంది ఇష్టపడుతారు. ఇసుక తిన్నెలపై సముద్రపు అలలు కొట్టుకొస్తుంటే, నీటిలో ఎగురుతూ సరదాగా గడుపుతాయి. కానీ, అవే అలలు ఉధృతం అయితే, భయానక రీతిలో తీరానికి కొట్టుకొస్తే? జనం భయంతో వణికిపోతారు. కానీ, ఓ ప్రదేశంలో జనాలు రాకాసి అలల నడుమ స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. చూడ్డానికే భయంకరంగా కనిపించే ఆ ప్రాంతంలో ఈత కొట్టాలంటే గుండె కాస్త పెద్దది అయి ఉండాలి. ఇంతకీ, ఆ ప్రదేశం ఎక్కవ ఉంది అంటే?
వణుకు పుట్టించే వీడియో..
ఈ వీడియో చూడండి.. నురగలు గక్కే అలలు తీరానికి ఎలా వచ్చి తగులుతున్నాయి. చూడ్డాని డేంజరస్ గా ఉన్నా, చాలా మంది ఇందులోకి జంప్ చేసి, స్విమ్మింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ అందమైన పర్యాటక ప్రదేశం మొరాకోలో ఉంది. కాప్ డి ఎల్ యూ అనేది అందమైన తీర ప్రాంతానికి ప్రసిద్ధి చెందింది. ఈత, క్లిఫ్ డైవింగ్ లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఎలాంటి కాలుష్యం లేని స్పటికంగా మెరిసే నీరు ఉంటుంది. కొండ ప్రాంతాల నుంచి ప్రజలు సముద్రంలోకి డైవ్ చేస్తారు. జంపింగ్‌కు ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, అదే సమయంలో ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నాడోర్ ప్రావిన్స్ గా పిలిచే ఈ ప్రాంతంలో ఓడరేవు కూడా ఉంటుంది. 2014 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 7,580 జనాభా ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తుంటారు.
Read Also: వార్ ఫీల్డ్ లో రిపోర్టింగ్.. మీదకు దూసుకొచ్చిన హెలికాప్టర్, కానీ…
ఈ వీడియోలను చూసి నెటిజన్లు ఏం అంటున్నారంటే?
కాపో డి అగువా ప్రాంతంలో తీర ప్రాంతాన్ని చూసి పర్యాటకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. కానీ, కొంత మంది ఈ ప్రాంతంలోని అత్యంత ప్రమాదక ప్రదేశంలో స్విమ్ చేసే వాళ్లను చూసి భయపడుతారు. వామ్మో అని వణికిపోతారు. అయితే, ఈ ప్రాంతంలో అధికారులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పర్యాటకులకు సూచిస్తూ, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ ప్రదేశంలో కొంత మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఎవరైనా పర్యాటకులు పొరపాటున సముద్ర జలాల్లో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే వారిని కాపాడటమే వీరి లక్ష్యం. మొత్తంగా ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేసేందుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. అయితే, ధైర్యం ఎక్కువ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రదేశంలో స్విమ్ చేస్తుంటారు.
Read Also: రైలుకు వేలాడుతూ మహిళల ప్రయాణం, నెట్టింట వీడియో వైరల్!