Single Movie Team : కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. కామెడీ ప్రధానంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు (Sri Vishnu). తెలుగు సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు మరోసారి పూర్తిస్థాయి కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 9న విడుదలైన ‘సింగిల్'(Single)సినిమా విడుదలైన మొదటి షో తోనే విశేషమైన స్పందనను పొందింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ రాజు(Karthik Raju)రూపొందించిన ఈ చిత్రం కామెడీని ప్రధానంగా చేసుకొని అన్ని వయసుల ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ హీరోయిన్ కేతికా శర్మ(Kethika Sharma), ‘లవ్ టుడే’ హీరోయిన్ ఇవానా(Ivana )ఇందులో హీరోయిన్లుగా నటించారు. శ్రీ విష్ణు – వెన్నెల కిషోర్(Vennela Kishore)కాంబినేషన్ తెరపై హాస్యం బాగా పండించింది. శ్రీ విష్ణు కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న సినిమాగా కూడా సింగిల్ మూవీ నిలిచింది అని చెప్పవచ్చు.
సింగిల్ తో సక్సెస్ సాధించిన శ్రీ విష్ణు..
ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి బజ్ ఏర్పడడంతో మొదటి రోజే ఏకంగా రూ.4.15 కోట్ల కలెక్షన్స్ వసూలు సాధించి, బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది. ఇక రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మూడవ రోజు కూడా భారీగానే కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో టీం మొత్తం ఒకే చోట చేరి సరదాగా ముచ్చటించారు. అందుకు సంబంధించిన వీడియోని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కి సంబంధించి తాజా ప్రోమోని ‘#మింగిల్ ఫన్ విత్ టీం # సింగిల్’ అనే క్యాప్షన్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమో వైరల్ గా మారడంతో ప్రోమో పేరిట బూతులు నేర్పిస్తున్నారు కదారా అనే రేంజ్ లో నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నిర్మాత ఎస్ కే ఎన్ (SKN) ను కూడా చెడగొట్టారు కదా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
#మింగిల్ ఫన్ విత్ టీం #సింగిల్ ప్రోమోలో ఏముందంటే..
ఈ వీడియోలో ఇవానా, కేతికా శర్మతో పాటు శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ , నిర్మాత ఎస్ కే ఎన్ కనిపించారు. ఇక ఇవానా, కేతికా శర్మ మధ్యలో ఎస్కేఎన్ కూర్చోవడంతో.. శ్రీ విష్ణు మీరేంటి అటువైపు కూర్చున్నారు.. అంటూ ప్రశ్నించగా? మీరంటే సింగిల్ చింతకాయలు అంటూ కేతిక కామెంట్ చేసింది. సింగిల్ అంటూ విడుదల చేసిన ఈ ప్రోమోలో డబుల్ మీనింగ్ డైలాగులతో టీం తెగ సందడి చేసింది. ముఖ్యంగా ఎస్ కే ఎన్ మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్లకు సిగ్గుతో తలవంచుకొని ఉండిపోయింది ఇవానా. అటు కేతిక మాత్రం తనకు అర్థం కానట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. మొత్తానికైతే పూర్తి వీడియో చూడాలి అంటే ఈరోజు సాయంత్రం ఐదు వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also read:HBD Vani Vishwanath: వాణి విశ్వనాథ్‌తో పెళ్లి అనుకున్న ఎన్టీఆర్.. మరి ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?