E-Paper
Advertisement

Goddess Parvati: సాక్యాత్తు శివుడినే మింగేసిన పార్వతీ దేవి – ఆ తర్వాత ఏమైందో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది

Goddess Parvati: సాక్యాత్తు శివుడినే మింగేసిన పార్వతీ దేవి – ఆ తర్వాత ఏమైందో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది
Advertisement

Goddess Parvati: సాక్ష్యాత్తు పరమశివుడినే మింగేసిన పార్వతీదేవి. అవును మీరు చదువుతున్నది ముమ్మాటికి నిజం పురాణాల్లో దాగి ఉన్న నిజం. ఆకలిని తట్టుకోలేక శివుడిని మింగేసిన పార్వతీదేవి.. తర్వాత ఏం జరిగింతో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. శివుడిని మింగడానికి అమ్మవారు ఒక కొత్త అవతారం ఎత్తడానికి కారణమైందనే కథనం పురాణాల్లో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఆ కథేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పార్వతీదేవి ఆకలి తట్టుకోలేక ఎదురుగా వచ్చిన పరమశివుడిని మింగేస్తుందట. అయితే ఇలా పార్వతీదేవి పరమశివుడిని మింగేయడానికి ఓ కారణం ఉందట. శివుణ్ని మింగేసిన పార్వతీదేవి దూమావతి దేవి అవతారం ఎత్తుతుందట. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఆ పురాణ కథేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పురాణ గాథ: ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీదేవికి తీవ్రమైన ఆకలి వేస్తుందట. శివుడిని ఆహారం కావాలని అడుగుతుందట. అయితే శివుడు ధ్యానంలో మునిగి ఉండి, ఆహారం ఏర్పాటు చేయడంలో కాస్త ఆలస్యం చేస్తారట.  అప్పుడు ఆకలిని తట్టుకోలేక పార్వతీదేవి పదేపదే ఆహారం అడిగినా శివుడు ధ్యానం నుంచి  లేవకపోవడంతో పార్వతీదేవికి బాగా కోపం వస్తుందట. కోపం మరియు ఆకలితో ఉన్న పార్వతీదేవి ఎదురుగా ఉన్న పరమశివుడినే  మింగేసి తన ఆకలి తీర్చుకుంటుందట.

ధూమావతి దేవిగా అవతారం: శివుడు లయకారుడు మరియు గరళకంఠుడు (విషాన్ని గొంతులో దాచుకున్నవాడు). ఆయనను మింగిన వెంటనే, శివుని గొంతులోని విషం వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల పార్వతీదేవి శరీరం నుండి పొగలు రావడం మొదలవుతాయట. ఆ సమయంలో శివుడు ఆమె గర్భం నుండి బయటకు వస్తూ నువ్వు నన్నే మింగేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు విధవవు (భర్త లేని స్త్రీ) అయ్యావు అని చెబుతాడట. ఆ సమయంలో పార్వతీదేవి ధరించిన రూపమే ధూమావతి దేవి అవతారమట. ఈ ధూమావతి దేవి దశమహావిద్యలలో ఒకరు. ఈ రూపంలో ఆమె పొగలు కక్కుతూ, కాకి వాహనంపై, చేతిలో చేట పట్టుకుని కనిపిస్తుందట.

Advertisement

దూమావతి అవతారం వెనకున్న అంతరార్థం: ఈ కథలో చాలా అంతరార్థం దాగి ఉందని పండితులు చెప్తున్నారు. పార్వతీదేవి అంటే ప్రకృతి, శివుడు అంటే పురుషుడు (చైతన్యం). ప్రకృతి పురుషుడిని తనలో కలిపేసుకున్నప్పుడు (మింగేసినప్పుడు), అక్కడ చైతన్యం శూన్యమై కేవలం జడత్వం (పొగ/చీకటి) మిగులుతుందట. అలాగే అమ్మవారి ఈ రూపం మనిషి జీవితంలో వచ్చే కష్టాలు, ఒంటరితనం మరియు ఆకలిని సూచిస్తుందట. అయితే భక్తితో ఎవరైతే  ఆమెను పూజిస్తారో.. వారికి అశాశ్వతమైన ఈ ప్రపంచ బంధాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగవాళ్లు ఆ రోజు తల స్నానం చేస్తే  ధనవంతులు అవుతారట.

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×