E-Paper
Advertisement

Vastu Tips : వారంలో ఆ రెండు రోజుల్లో అప్పు తీసుకుంటే …

Vastu Tips : వారంలో ఆ రెండు రోజుల్లో అప్పు తీసుకుంటే …
Advertisement
Vastu Tips

Vastu Tips : ఈ రోజుల్లో అప్పు లేని జీవితం గడపడం కష్టమే. అంబానీ అయినా అదానీ అయినా అప్పులతో బిజినెస్ చేస్తుంటారు. అలా చేసే అప్పు మనకు ఆదాయం పుట్టించే విషయాల్లో చేస్తే పర్వాలేదు కానీ ఆడంబరాల కోసం అస్సలు చేయకూడదు. కొంతమంది ఎంత ప్రయత్నించినా చేసిన అప్పు తీర్చలేరు. చివరకు అప్పుల బాధపడలేక కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు. మరికొందరు అజ్ఞాతవాసిగా మారిపోతుంటారు. అప్పులు తీర్చలేకపోవడానికి కారణం మనం చేసే తప్పులే. మనం అప్పు తీసుకునే సమయం కూడా మన తలరాతని డిసైడ్ చేస్తుందని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వారంలో మంగళవారం నాడు అస్సలు అప్పు తీసుకోరాదు.

Advertisement

మంగళవారం నాడు అప్పు తీసుకుంటే మళ్లీ మళ్లీ తీసుకుంటూనే ఉంటారు. మంగళవారం నాడు చేసే పని మళ్లీ మళ్లీ చేస్తారని శాస్త్రం చెబుతోంది. రుణం తీర్చడానికి మాత్రం మంగళవారం సరైన రోజుగా పెద్దలు చెబుతుంటారు. మంగళవారం నాడు బాకీ తీర్చేస్తే మీకు ఉన్న మిగతా అప్పులు కూడా క్రమంగా తీరిపోతాయి. అలాగే బుధవారం, శుక్రవారం నాడు మనం ఎవరికి అప్పు ఇవ్వకూడదు. చాలా చోట్ల శుక్రవారం నాడు అప్పు ఇవ్వబోమని చెబుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ సెంటిమెంటు బాగా ఫాలో అవుతుంటారు. అలాగే బుధవారం నాడు కూడా రుణంగా ఎవరికి ధనం ఇవ్వకూడదు. ఆ రోజు అప్పుగా ఇచ్చిన ధనం మళ్లీ మన చేతికి రావడం చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు పాటు అది మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. ఆ డబ్బు మీకు తిరిగి రాకపోవచ్చు కూడా…

వర్కర్లకు, పని వాళ్లకు జీతాలు బుధవారం, శుక్రవారం రోజు ఇవ్వడంలో తప్పులేదు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయచ్చు . పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం బుధవారం, శుక్రవారం రోజుల్లో కాకుండా జాగ్రత్త పడాలి. మిగిలిన రోజుల్లో ఎప్పుడు ఇచ్చినా మీ డబ్బు మీకు చేరుతుంది. డబ్బు ఉన్నా కొంతమంది అప్పు తీర్చరు . కారణం మనం బుధవారం లేదా శుక్రవారం డబ్బులిచ్చిన రోజై ఉంటుంది. చుట్టాలైనా , ప్రాణ స్నేహితులైనా అప్పు అడిగితే బుధవారం, శుక్రవారం మాత్రం ఇవ్వకుండా ఉంటే మంచిది. లక్ష్మీదేవిని గౌరవించిన వారి దగ్గర మాత్రమే లక్ష్మి ఉంటుంది. మనుషులే ముఖ్యం డబ్బులు ముఖ్యం కాదంటూ డైలాగులు చెబుతూ లక్ష్మిని అవమానించే వారి నుంచి డబ్బు దూరం అవుతుంది. అలాగే డబ్బులు లెక్కపెట్టేటప్పుడు కొంతమంది నోటితో వేలును తడిపి ఎంగిలి చేత్తో లెక్కపెడుతూ ఉంటారు. అది కూడా మహాలక్ష్మిని అవమానించినట్టే అవుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×