BigTV English

Meesho : మీషో టార్గెట్ అదే..! అందుకే ఏఐతో ఒప్పందం..

Meesho : మీషో టార్గెట్ అదే..! అందుకే ఏఐతో ఒప్పందం..
Meesho


Meesho : ప్రతీ రంగం, ప్రతీ బిజినెస్ ముందుకు వెళ్లాలంటే తమ కస్టమర్లను, యూజర్లను ఆకర్షించాలి. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో వారిని ఇంప్రెస్ చేయాలి. ఈరోజుల్లో కస్టమర్లు కూడా కంపెనీల దగ్గర నుండి ఎక్కువగా క్రియేటివిటీని కోరుకుంటున్నారు. అందుకే సంస్థలు లేటెస్ట్ టెక్నాలజీపైన ఆధారపడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ). తాజాగా ఒక షాపింగ్ యాప్ కూడా ఏఐను పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది.

మీషో అనే షాపింగ్ యాప్ కొద్దికాలంలోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఎప్పటినుండో ఉన్న షాపింగ్ యాప్స్‌కు పోటీగా తన బ్రాండ్‌ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం కస్టమర్లకు మరింత సంతృప్తిని అందించడం కోసం, యాప్ యాక్టివిటీని మెరుగుపరచుకోవడం కోసం ఏఐతో చేతులు కలిపింది మీషో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తయారు చేసిన విజన్ అండ్ ఏఐ ల్యాబ్ (వాల్)తో ఒక సంవత్సరం ఒప్పందం చేసుకుంది. ఈ కామర్స్ సెక్టార్‌లో ఏఐ భవిష్యత్తులో సృష్టించే అద్భుతాలను ముందస్తుగా కనిపెట్టిన మీషో.. ఈ ఒప్పందానికి సిద్ధమయినట్టు నిపుణులు అంటున్నారు.


ఈ కామర్స్ సెక్టార్‌ను ఏఐ రంగం శాసించే సమయానికి మీషో ఏఐపై పట్టు సాధించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మీషో డేటా సైంటిస్టులతో కలిసి ఏఐపై ప్రయోగాలు చేయిస్తోంది. ముఖ్యంగా కస్టమర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడాన్ని మీషో మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే ఆన్‌లైన్ రీటెయిల్ ఆపరేషన్స్ విషయంలో, ఈ కామర్స్ విషయంలో ఏఐ.. పలు యాప్స్‌తో చేతులు కలిపింది. అందులో ఇప్పుడు మీషో కూడా చేరింది. మీషో యాప్‌కు ఈ కామర్స్‌ విషయంలో మంచి అనుభవం ఉండడంతో ఏఐ సాయంతో మిగతా యాప్స్‌కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

క్రియేటివిటీ, టెక్నాలజీ సాయం లేకపోతే.. ఈ కామర్స్ కూడా వెనకబడిపోతుందని, అందుకే మీషో విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం అంటోంది. ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్ల అభిరుచులు కూడా మారుతున్నాయని అంటున్నారు. అందుకే అటు యాప్ అభివృద్ధిపై, ఇటు కస్టమర్ల సంతృప్తిపై ఏఐ తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు నమ్ముతున్నారు. అంతే కాకుండా ఈ కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటికి కస్టమర్లకు మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించడానికి ఏఐ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×