BigTV English

Bad Habits Reason: గ్రహ దోషాలుంటే ఈ 4 చెడు అలవాట్లు ఉంటాయట.. మీలో ఇవి ఉన్నాయా..?

Bad Habits Reason: గ్రహ దోషాలుంటే ఈ 4 చెడు అలవాట్లు ఉంటాయట.. మీలో ఇవి ఉన్నాయా..?

Bad Habits Reason: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో గ్రహాల స్థానంతో పాటు కొన్ని చెడు అలవాట్లు కూడా వెంటాడుతాయట. చెడు అలవాట్లు ఉంటే తప్పకుండా వారిపై గ్రహ దోషం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. దీంతో జీవితంలో చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమితే జ్యోతిష్యం ప్రకారం గ్రహ దోషాల కారణంగా కలిగే చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.


మద్యం సేవించడం

మద్యం సేవించే అలవాటు ఉంటే, అది అతిపెద్ద గ్రహ దోషం ఉందని అర్థం. నిజానికి, మద్యం మత్తులో ఉన్న ఎదుటివారిని వేధిస్తుంటాడు. చెడుగా ప్రవర్తిస్తాడు. ఎవరికైనా ఈ చెడు అలవాటు ఉంటే ఈరోజే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శని గ్రహం బలహీనంగా మారుతుంది. దీనితో పాటు జాతకంలో శని సాడే సతీని కలిగి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మద్యం సేవించకూడదు.


ఉదయం ఆలస్యంగా లేవడం

ఉదయం ఆలస్యంగా మేల్కొనే అలవాటు ఉంటే, అది కూడా గ్రహ దోషాలకు అతిపెద్ద కారణం. వాస్తవానికి, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం జాతకంలో సూర్య దోషాన్ని సృష్టిస్తుంది. దీంతో పాటు, పని చేస్తున్న సహోద్యోగిని ఎప్పుడూ అవమానించకూడదు.

పెద్దలను గౌరవించకపోవడం

పెద్దలను లేదా గురువును అవమానించే అలవాటు కలిగి ఉంటే, అది కూడా జాతకంలో గ్రహ దోషాలకు ప్రధాన కారణం. వాస్తవానికి ఇది జాతకంలో గురు దోషాన్ని సృష్టించడానికి పని చేస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో గురు దోషం ఉంటే కెరీర్‌లో ఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కొంటాడు. కాబట్టి పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించండి.

జంతువులను వేధించడం

మూగ జంతువులను ఎప్పుడూ వేధించకూడదు. ఇది జాతకంలో కేతువు గ్రహాన్ని బలహీనపరుస్తుంది. అంతేకాదు జీవితంలో అశాంతి వ్యాపిస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడితో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయి.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×