BigTV English

Guru Gochar 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురుడు ప్రవేశం.. ఈ రాశులకు వారి గుడ్ న్యూస్!

Guru Gochar 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురుడు ప్రవేశం.. ఈ రాశులకు వారి గుడ్ న్యూస్!
Guru Gochar 2024
Guru Gochar 2024

Jupiter Transit 2024: 12 ఏళ్ల తర్వాత గురుడు వృషభరాశిలో సంచరించబోతున్నారు. దీని వల్ల 4 రాశులవారికి అదృష్టం కలుగుతుంది. దేవతల గురువు బృహస్పతి.. అదృష్టం, సంపద, వివాహం ఇలాంటి అంశాలను ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది. గురుడును శుభ గ్రహంగా పరిగణిస్తారు. గురుడు ప్రభావం వల్ల అదృష్టం, ధనం, జ్ఞానం కలుగుతుంది. ఈ గ్రహం సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తాడు. గురుడు ఏడాదికి ఒకసారి తన రాశిని మారుస్తాడు. 2024లో గురుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.


మహా గోచారం..
మే 1న గురుడు తన రాశిని మార్చి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాంటి యోగం 12 ఏళ్ల తర్వాత రాబోతోంది. అందువల్ల వృషభరాశిలోకి గురుడు ప్రవేశాన్ని పెద్ద ఘట్టంగా పేర్కొంటారు. గురుడి సంచార ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అయితే 4 రాశుల వారికి మాత్రం చాలా శుభప్రదంగా ఉంటుంది.

మేష రాశి..
ప్రస్తుతం గురుడు మేషరాశిలో ఉన్నాడు. ఇప్పుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మేష రాశి వారికి గురుడి రాశి మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు తమ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి ఆనందాన్ని పొందుతారు.


Also Read: మార్చి 31 నుంచి మీనరాశిలో శుక్రుని సంచారం.. ఈ 3 రాశుల వారికి లాభాలు..

వృషభ రాశి..
గురుడు వృషభరాశిలో సంచారం వల్ల ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ వ్యక్తుల జీవితాల్లో చాలా సానుకూల మార్పులు వస్తాయి. కెరీర్‌లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కార్యాలయంలో గౌరవం పొందుతారు. కెరీర్ లో విజయాన్ని సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి గురుడు సంచారం అదృష్టాన్ని తెస్తుంది. పనిలో విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. భౌతిక సుఖాన్ని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక సుఖాన్ని పొందుతారు.

Also Read: Lunar Eclipse 2024: హోలీ రోజున చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

కన్య రాశి..
కన్య రాశి వారికి గురుడి సంచారం కూడా మంచిది. అదృష్టం కలుగుతుంది. కోరికలు నెరవేరవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Old Vishnu idol: అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి.. ఇదొక అద్భుతం.. మీరు చూసేయండి!

Big Stories

×