TDP ALLEGED POLL CODE VIOLATION BY YSRCP GOVT: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ వెరైటీగానే ఉంటాయి. ఫలితాలు వచ్చేవరకు ఎవరు విజయం సాధిస్తారో చెప్పడం కష్టం. నేతలు మాత్రం తమదే విక్టరీ అంటూ పైకి చెబుతుంటారు. ఇక ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ వచ్చేసింది. కోడ్ కూడా అమల్లోనే ఉంది. ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తోంది. చాలా ఏరియాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. మరి పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు కేంద్ర బలగాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి. కవాతు కూడా నిర్వహించాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లను సిద్ధం చేసింది ఈసీ. అయినా కోడ్ ఉల్లంఘనపై ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు సగటు ఓటర్లు.
కోడ్ వైలేట్ పై రెండు విషయాలను గుర్తుకు తెచ్చుకుందాం. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అధికార వైసీపీకి చెందిన నేతలు ఓటర్లకు చీరలు పంపిణీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండురోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అధికారులు కూడా భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నారు. అయినా పంపిణీ ఎక్కడా ఆగలేదు. చీరల బాక్సులపై సీఎం జగన్ ఫోటోలు ఉండడంపై టీడీపీ ప్రశ్నిస్తోంది. తొలిరోజు 1500 పైగా చీరలను సీజ్ చేసిన అధికారులు.. గురువారం ఆ సంఖ్య 5 వేలు దాటేసింది. ముఖ్యంగా సత్తెనపల్లి పారిశ్రామికవాడలోని ఓ గోదాంలో భారీగా చీరలు నిల్వ చేశారని టీడీపీ నేతలు చెబుతున్నమాట. అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. వీటిని తెచ్చిన బట్టల వ్యాపారిపై కేసు కూడా నమోదైంది.
మరోవైపు కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ వాహనాలు వినియోగించరాదని ఈసీ చెబుతోంది. కానీ అధికార వైసీపీకి అదేమీ పట్టలేదు. విశాఖలో మంత్రి, తుని వైసీపీ అభ్యర్థి దాడి శెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఫ్లయింగ్ స్వ్కాడ్ పట్టుకుంది. కార్లకు ముందు వైసీపీ జెండాలు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న వాహనాలను అగనంపూడి టోలు గేటు వద్ద తనిఖీలు చేసి, స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కారులో ఉన్న కొంతమందిని పోలీసులకు అప్పగించారు.
Also Read: TDP Workshop Candidates:ఛాన్స్ ఇవ్వొద్దు.. వదలొద్దు.. అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు
ఇది కాకుండా జగన్ ఫోటోతో గోడ గడియాలు మొన్నటిమొన్న కడప పంపిణీ చేశారు. అలాగే పదోతరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు జగన్ పేరుతో ఉన్న పేడ్స్ ఇచ్చారు. అంతర్గత సమాచారం ప్రకారం ఏపీలో క్రికెట్ కిట్లు పంచేందుకు నేతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎగ్జామ్స్ పూర్తికాగానే వాటిని ఏరియా వారీగా విద్యార్థులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి అధికారులు మేలుకొని వాటిపై ఫోకస్ పెడతారా? లేదా అనేది చూడాలి.