Devotional

Lucky Horse : మీ ఇంటికి లక్కీ హార్స్ తెచ్చారా…..

Lucky Horse

Lucky Horse : ఇంటికి ఐశ్వర్యం తెచ్చే వస్తువులు కొన్ని ఉంటారు. వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పరిస్థితులు పాజిటివ్ గామారుతాయి. అలాంటి వాటిలో ఒకటి గుర్రం బొమ్మ. ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్లో ఇది ఒకటి. హయగ్రీవ రూపంలో శ్రీ మహా విష్ణువు రూపం గుర్రం. అశ్వని రూపంలో బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది . గుర్రం సమస్త సంపదలకి సంకేతంగా భావిస్తారు. గుర్రాలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదంగా చెబుతారు. గుర్రాల పెయింటింగ్ ను ఇంటి హాల్ లో పెట్టుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంటి హాల్ లో గానీ బెడ్ రూంలో కానీ హార్స్ పెయింట్ ను పెట్టుకోవడం వల్ల అఖండ ధనలాభం కలిగే సూచనలు ఉంటాయి.

కొన్ని దేశాలలో గుర్రం , ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచడం వల్ల అదృష్టంతోపాటు శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.అందుకే కొన్ని జంతువులను అదృష్టదేవతులగా భావిస్తారు.అయితే ఇంట్లో గుర్రాల బొమ్మ లేదా పెయింటింగ్ పెట్టేటప్పుడు ఇంటి ఎంట్రన్స్ వైపు పెట్టకూడదు. సింహద్వారాన్ని చూస్తున్న దిక్కులో గురాన్ని ఉంచకూడదు. అలా చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. ఇంట్లో ధనం కూడా అలాగే వెళ్లిపోయి ఆర్ధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ.
ఇంటి లోపలు వస్తున్నట్టు పెట్టుకుంటే మంచిది. సహజంగా మార్కెట్లో గుర్రం బొమ్మలు దొరుకుతాయి. వాటిని ఇంట్లో దక్కిణం దిక్కున పెట్టుకుంటే మహిళలకి బాగా కలిసి వస్తుంది. హయగ్రీవుని కృపతో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సౌభాగ్యవంతులవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించే వారు, చానాళ్లుగా ఒకే పోస్టులో కొనుగుతున్న వారు జీవితంలో మరో దశకి చేరుకోవడానికి నైరుతి దిశలో హార్స్ పెయింటింగ్ ను పెట్టుకోవడం శుభకరంగా ఉంటుంది.

ఇంట్లో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్ లు కూడా తీసుకొస్తుంది ఈ లక్కీ హార్స్ . ఈశాన్య దిక్కులో హార్స్ పెయింటింగ్ పెట్టుకున్నా బొమ్మ పెట్టుకున్నా విద్యార్ధులకి రాణింపు ఉంటుందనేది వాస్తు పండితులు చెప్పే మాట.
గుర్రాల పెయింటింగ్ లో వేగం పెడుతున్నట్టు కనిపించేవి సెలెక్ట్ చేసుకోవాలి. నిత్యం అవి మనకు ఎదురుగా కనిపించేలా పెట్టుకోవాలి. గుర్రాల మాదిరిగా వేగంగా ధృడంగా పరిగెట్టాలన్న ఆలోచనలకు అవి మనలో కలిగిస్తాయి. ఇలాంటి ఫోటోల వల్ల పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది.

Related posts

Swastik Symbol : స్వస్తిక్ సింబల్ ఆ గోడపై పెట్టి చూడండి…

BigTv Desk

Lakshmi Puja : దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేయాలంటే…

BigTv Desk

Ayyappa Swami and Parashuram : అయ్యప్పస్వామికి.. పరశురాముడికి సంబంధమేంటి?

BigTv Desk

Leave a Comment