Silver Ring Benefits: బంగారం, వెండి ఆభరణాలను ధరించడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇదిలా ఉంటే వెండితో తయారు చేసిన ఉంగరాలు కూడా చాలా మంది వాడుతుంటారు. కానీ వెండి ఉంగరం కేవలం ఒక సాధారణ ఆభరణం కాదని మీకు తెలుసా ? ఇది గ్రహాలకు సంబంధించినది. వాస్తు శాస్త్రం ప్రకారం.. వెండి ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. మీరు కూడా వీటి యొక్క ప్రయోజనాల గురించి తెలియని వారిలో ఒకరు అయితే.. ఇప్పుడు తెలుసుకోండి.
వెండి ఉంగరం ఏ వేలుకు ధరించాలి ?
మత విశ్వాసాల ప్రకారం.. వెండి ఉంగరాలను ఎల్లప్పుడూ ఎడమ చేతి చిటికెన వేలుకు ధరించాలి. దీనిని చిటికెన వేలు అని పిలుస్తారు. ఈ వేలికి ఉంగరం ధరించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి లభిస్తుంది. అంతే కాకుండా మీ అదృష్టం పెరుగుతుంది. అదేవిధంగా.. మత విశ్వాసాల ప్రకారం.. ఎడమ చేతికి వెండి ఉంగరం ధరించడం కూడా మంచిది ఎందుకంటే ఇది మానసిక , భావోద్వేగ ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా, వెండి చంద్రుడిని సూచిస్తుంది. చంద్రుడు మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సానుకూలతను కలిగిస్తాడు.
వెండి ఉంగరం ఏ రోజు ధరించాలి ?
వెండి ఉంగరం సోమవారం నాడు, ముఖ్యంగా ఉదయం చంద్ర మంత్రాలను పఠించిన తర్వాత ధరించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని చేతికి ధరించే ముందు, సాత్విక ఆహారం తీసుకొని ధ్యానం చేయండి. ఉంగరాన్ని గంగా జలం, పాలు , పచ్చి బియ్యంతో శుద్ధి చేయండి. వేరొకరికి ధరించడానికి ఇవ్వకూడదు. వెండి ఉంగరం ధరించే ముందు.. మీ జ్యోతిష్కుడిని ఒకసారి సంప్రదించడం మర్చిపోవద్దు. ఎందుకంటే అతడు మీ గ్రహాల ధరించమని సలహా ఇస్తాడు.
జ్యోతిష్యశాస్త్రంలో.. వెండి చంద్రుడికి సంబంధించినది. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే వారు వెండి ధరించడం మంచిది.
వెండిని ప్రతికూల శక్తిని తొలగించే లోహంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుతుంది. దీనిని ధరించడం వల్ల చెడు దృష్టి నుండి కూడా రక్షణ లభిస్తుంది.
వెండి ఉంగరం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. అంతే కాకుండా చిరాకు , కోపాన్ని తగ్గిస్తుంది.
వెండి ఉంగరం ధరించడం వల్ల మీ ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబం, భార్యాభర్తల మధ్య జీవితంలో ఆనందం, ప్రేమ పెరుగుతుంది.
వెండిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దీనిని ధరించడం వల్ల సంపద, అదృష్టం , శ్రేయస్సు పెరుగుతాయి. అంతే కాకుండా ఇది వ్యాపారం, వృత్తిలో శుభ ఫలితాలను ఇస్తుంది.
Also Read: శని సంచారం.. ఏప్రిల్ 28 నుండి వీరికి డబ్బే డబ్బు
మీ ఇంట్లో ఎల్లప్పుడూ సంపద , శ్రేయస్సు ఉండాలనుకుంటే వెండిని ఉపయోగించడం ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం అని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వెండి సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవితో ముడిపడి ఉంటుంది. కాబట్టి.. మీ కుడి చేతి చిటికెన వేలికి వెండి ఉంగరం ధరించడం లేదా మీ పాకెట్ లో చిన్న వెండి ముక్కను ఉంచుకోవడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.