Indian Railways: సమ్మర్ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి బోలెడు మంది ప్రయాణీకులు గోవాకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు గోవా బీచ్ లో చల్లగా బీరు తాగుతూ సదాగా ఎంజాయ్ చేస్తుంటారు. గోవా వెకేషన్ కోసం చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే షాకింగ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి గోవా, గుజరాత్ కు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు, చేసుకోవాలనుకుంటున్న ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాని సూచించింది.
ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పలు రైళ్లు రద్దు
మహారాష్ట్రలోని గోండియా జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఇంటర్ లాకింగ్ పనులు నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈ పనులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి గోవా, గుజరాత్ కు వెళ్లే ప్రయాణీకులు కొద్ది రోజుల పాటు అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్- రక్సౌల్ ఎక్స్ ప్రెస్, దర్భంగా- చర్లపల్లి, మాల్డా టౌన్- సూరత్, జసిదిహ్- వాస్కో డ గామా వరకు నడిచే రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రద్ద అయిన 8 రైళ్ల వివరాలు
⦿ ఏప్రిల్ 29, మే 3న చర్లపల్లి-దర్భంగా ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
⦿ మే 1న హైదరాబాద్- రక్సౌల్ ఎక్స్ ప్రెస్ ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.
⦿ మే 2, 6 తేదీలలో దర్భంగా- చర్లపల్లి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు.
⦿ మే 2న వాస్కోడగామా-జసిదిహ్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశామన్నారు.
⦿ మే 3న మాల్డా టౌన్-సూరత్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడుతుందన్నారు
⦿ మే 4న రక్సౌల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులో ఉండదన్నారు.
⦿ మే 5న జసిదిహ్- వాస్కో డ గామా ఎక్స్ ప్రెస్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు.
⦿ మే 5న సూరత్- మాల్డా టౌన్ ఎక్స్‌ప్రెస్ పని చేయడం లేదన్నారు.
Read Also: రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందూ టికెట్ బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా చేయండి!
సుమారు 16 వేల మంది ప్రయాణీకులకు ఇబ్బంది
ఇక ఈ రైళ్ల క్యాన్సిల్ వల్ల సుమారు 16 వేల మంది ప్రయాణీకులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు రైల్వే అధికారులు. ఒక్కో రైలులో సుమారు 2 వేల మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. మొత్తం 8 రైళ్లు రద్దు కావడం వల్ల 16 వేల మంది ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రద్దు అయిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Read Also: పది నిమిషాల్లో సీట్లో ఉండాలి, లేదంటే క్యాన్సిల్.. ఇదీ అసలు కథ!