కొన్ని మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుందని హిందూ పురాణాలలో చెబుతారు. మంత్రాలు అంటే కొన్ని శక్తివంతమైన పదబంధాల కలయిక. ఇవి స్థిరంగా జపిస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు జీవితంలో కలుగుతాయని అంటారు.
హిందూ పురాణాలలో ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా పెద్దవారే పూజలు చేసేటప్పుడు జపిస్తూ ఉంటారు. అయితే చిన్న వయసులోనే పిల్లలకు నేర్పాల్సిన 11 శక్తివంతమైన హిందూ మంత్రాలు ఉన్నాయి. ఇవి జపిస్తే పిల్లలకు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఇవి లయబద్దంగా జపం చేసినప్పుడు ఆ ధ్వని కంపనాలు శక్తివంతంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కోరికలను నెరవేర్చడంతో పాటు శ్రద్ధా, ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతిని శరీరంలో పెంచుతాయి. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలకు నేర్పాల్సిన 11 శక్తివంతమైన హిందూ మంత్రాలను ఇక్కడ ఇచ్చాము. వీటిని మీ పిల్లలకు తప్పకుండా నేర్పండి.
1. ఓం నమశ్శివాయ
ప్రతి ప్రతికూలత, అజ్ఞానం, అంతిమ వాస్తవికతను నాశనం చేసే మంగళకరుడైన శివునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఈ మంత్రానికి అర్థం. ప్రతిరోజు ఓం నమశ్శివాయ జపిస్తే ఎంతో మంచి జరుగుతుంది.
2. ఓం గం గణపతయే నమః
వినాయకుడిని ఉద్దేశించి శక్తివంతమైన మంత్రం ఇది. అడ్డంకులను తొలగించే జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదించే సర్వోన్నతమైన గణేశుడికి నా నమస్కారాలు అని దీని అర్థం.
3. ఓం ఘ్రాణిా సూర్యయే నమః
కలియుగంలో ప్రత్యక్ష దేవుడు సూర్యుడే. సమస్త ప్రాణాలకు, ప్రాణ శక్తికి మూలమైన సూర్య భగవానునికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను అని చెప్పడమే ఈ మంత్రం ఉద్దేశం.
4. ఓం నమో భగవతే వాసుదేవాయ
జ్ఞానం, పరాక్రమం, సంతోషముతో సహా అన్ని గుణాలు కలిగిన సర్వశక్తివంతుడైన ఆ వాసుదేవునికి నా నమస్కారాలు అని ఈ మంత్రం ఉద్దేశం. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడంటే ఆ విష్ణుమూర్తి.
5. త్రయోంబకం యజామహే సుగగంధింయో పుష్టిగవర్ధోనం । ఉగర్వాగరుకమివోవ బంధోనాన్మృగత్యోర్ముక్షీయః మామృతాయోత్ ।
మూడు కన్నుల ఆరాధ్య దైవమైన శివునికి నా నమస్కారాలు. ఆయన మనకు అమరత్వాన్ని ప్రసాదించి మృత్యువు, భయం అనే సంకెళ్ళ నుంచి విడిపించి రక్షించును గాక అని ఈ మంత్రం ఉద్దేశం. పూజ చేసేటప్పుడు రోజుకు మూడుసార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
6. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
శక్తి, తేజము, జ్ఞానోదయాన్ని సూచించే గాయత్రి పట్ల కృతజ్ఞత చూపేందుకు ఈ మంత్రాన్ని జపిస్తారు.
7. సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా
ఆ సరస్వతీ దేవిని పూజించే మంత్రం ఇది. జ్ఞానాన్ని ఇచ్చే దేవత అయినా సరస్వతి దేవికి నా నమస్కారాలు అంటూ ఈ మంత్రాన్ని చదువుతారు. పిల్లలు తమకు చదువును ప్రసాదించమని ఆ సరస్వతి దేవికి నమస్కరిస్తారు.
8. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం
ఐశ్వర్యం శ్రేయస్సు ను అందించే లక్ష్మీదేవి, జ్ఞానాన్ని అందించే సరస్వతి దేవి, విశ్వాన్ని సంరక్షించే శ్రీమహావిష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను అంటూ ఈ శ్లోకం అర్థం. ఉదయం లేచిన వెంటనే ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఒక మంత్రంలోనే ముగ్గురు దేవతలను స్తుతించవచ్చు.
9. హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే
నేను విష్ణు రూపమైన శ్రీకృష్ణునికి, రామునికి నమస్కరిస్తున్నాను అంటూ చెప్పే కృష్ణ మహా మంత్రం. ఇది రోజులో ఇప్పుడైనా దీన్ని పఠించవచ్చు.
10. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః
గురువు రూపంలో ఉన్న త్రిమూర్తులకు నా నమస్కారాలు అని చెప్పి శ్రీమహావిష్ణువు, శివుడు, బ్రహ్మాను కొలిచే శ్లోకం ఇది. పిల్లలకు ప్రతిరోజు దీన్ని పఠించాల్సిన అవసరం ఉంది.
11. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
దేవి శ్రీ శక్తికి నేను నమస్కరిస్తున్నాను. జ్ఞాన దేవతకు వినయాన్ని కృతజ్ఞతలు ప్రదర్శిస్తున్నాను అంటూ విద్యార్థులు సరస్వతీ దేవుని కొలిచేందుకు ఈ శ్లోకాన్ని జపిస్తారు.
Also Read: ఈ సృష్టికర్త బ్రహ్మదేవుడే.. కానీ ఆయన్ని ఎవరు పూజించరు, ఎందుకు?