BigTV English

Game Changer: సుకుమార్ హైప్ పెంచారు కానీ.. ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?

Game Changer: సుకుమార్ హైప్ పెంచారు కానీ.. ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?

Game Changer:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తాజాగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ (S.Shankar)దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫాన్స్ లో ఈ సినిమా ఫలితం పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


గేమ్ ఛేంజర్ పై హైప్ పెంచిన సుకుమార్..

సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చిరంజీవితో కలిసి చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాగ్ అయితే సూపర్ హిట్. క్లైమాక్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రాంచరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి సినిమాపై హైప్ పెంచేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ అంచనాలను మరింత పెంచేస్తూ.. చెన్నైలో ఇన్సైడ్ టాక్ అందరినీ సంతోష పరుస్తోంది. తాజాగా చెన్నై నుండీ అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది అని, ఇంటర్వెల్ మహా అద్భుతం అని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఇంటర్వ్యూ పార్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని సమాచారం.


ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..?

రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కచ్చితంగా ఆయన తన పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేస్తాడనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అంజలి (Anjali), కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కాలేజీ సీన్స్ అలాగే విలన్ ఎస్.జే.సూర్య(SJ.Surya ) పవర్ఫుల్ ఇంట్రో ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయట. పట్టుదలతో హీరో ఒక ఛాలెంజ్లో ఎలా గెలిచాడు? అనేది ఇంటర్వెల్ బ్లాకులో హైలెట్ అవుతుందని, ఇక సెకండ్ హాఫ్ లో అప్పన్న పాత్ర, సామాజిక అంశాలు, దీనికి తోడు పొలిటికల్ సీన్స్ అన్నీ బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అంతేకాదు అంజలి పాత్ర కూడా ఎమోషనల్ గా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా శంకర్ కి ఈ సినిమాతో కచ్చితంగా మార్కెట్ పెరుగుతుందని కూడా చెన్నై సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ప్రతి చోటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఈ సినిమాతో రామ్ చరణ్ జాతీయ అవార్డు అందుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందరి అంచనాలను నిజం చెయ్యాలని, రికార్డులను సైతం బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×