Sabarimala Special Trains: ప్రతి ఏటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నది. అందులో భాగంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే సంస్థ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, తాజాగా వీటిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే సంస్థ నిర్ణయంతో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలనుకే వారికి షాక్ తగిలినట్లు అయ్యింది. ఇంతకీ రైల్వే సంస్థ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..
ప్రయాణీకులు లేక ప్రత్యేక రైళ్లు రద్దు
అయ్యప్ప భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే షెడ్యూల్ చేసిన ప్రత్యేక రైళ్లకు ప్రయాణీకుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 10కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ ప్రకారం మౌలాలి-కొట్టాయం, కొల్లం-మౌలాలి, నర్సాపూర్-కొల్లం, సిర్పూర్ కాగజ్‌నగర్- కొల్లం, కొట్టాయం-సికింద్రాబాద్, హైదరాబాద్-కొట్టాయం వంటి పలు స్టేషన్ల మధ్య ఈ రైలు సర్వీసులను కొనసాగించాలని నిర్ణయించారు. సుమారు 120 ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసింది. అయితే, అనుకున్న స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో శబరిమల వెళ్లాలి అనుకునే వారికి ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తున్నది.
Read Also: రేపే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం, సికింద్రాబాద్ స్టేషన్ పై తగ్గనున్న భారం!
రద్దు అయిన ప్రత్యేక రైళ్లు ఇవే..
⦿ జనవరి 24 – మౌలాలి – కొట్టాయం(07167)
⦿ జనవరి 25 – కొట్టాయం – మౌలాలి(07168), మౌలాలి – కొల్లాం(07171)
⦿ జనవరి 27 – కొల్లాం – మౌలాలి(07172)
⦿ జనవరి 26 – కాచిగూడ – కొట్టాయం(07169)
⦿ జనవరి 27 – కొట్టాయం – కాచిగూడ(07170), నర్సాపూర్ – కొల్లాం(07157)
⦿ జనవరి 29 – కొల్లాం – నర్సాపూర్(07158)
⦿జనవరి 28 – హైదరాబాద్ – కొట్టాయం(07065)
⦿ జనవరి 29 – కొట్టాయం – సికింద్రాబాద్(07066)
⦿ జనవరి 31 – మౌలాలి – కొట్టాయం(07167)
⦿ ఫిబ్రవరి 1 – కొట్టాయం – మౌలాలి(07168)
Read Also: కేబుల్ బ్రిడ్జిపై రైలు.. చరిత్రలో ఇదే తొలిసారి , వీడియో చూస్తే మైండ్ బ్లాకే !
ఈ రైళ్లకు అనుకున్న దానికంటే చాలా తక్కువ బుకింగ్స్ వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫలితంగా ఈ రైళ్లను షెడ్యూల్ చేసిన తేదీల కంటే ముందే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే యాత్రికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. వాస్తవానికి డిసెంబర్ రెండో వారం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకుంటారు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి కనిపించే వరకు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. గత ఏడాది పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లిన నేపథ్యంలో ఈసారి ముందస్తు జాగ్రత్తగా పెద్ద మొత్తంలో రైళ్లను షెడ్యూల్ చేసింది. ఎక్కువగా బుకింగ్స్ రాకపోవడంతో రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: తెలుగు రాష్ట్రాల నుంచి కాశ్మీర్ కు రైళ్లు ? ఏయే నగరాల మీద నుంచంటే…