BigTV English

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Shradh 2024: భద్ర పూర్ణిమ నుంచి సర్వపితృ అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృ పక్షం ఉంటుంది. ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడం ఆనవాయితీ. పితృపక్ష సమయంలో పూర్వీకులు భూమిపైకి వస్తారని నమ్ముతారు. సర్వపితృ అమావాస్య రోజు పూర్వీకుల కోసం పూజలు నిర్వహిస్తారు.


పితృ పక్షం సెప్టెంబర్ 18, 2024 భద్ర పూర్ణిమ తిథి రోజు ప్రారంభమైంది. 15 రోజుల పాటు శ్రద్ధ తర్పణం కొనసాగుతుంది. గతంలో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమయంలో పూర్వీకులను ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే అన్ని ఆత్మలు మరణం తర్వాత శాంతిని పొందలేవని హిందువులు నమ్ముతారు. అందుకే ఈ సమయంలో మరణించిన పూర్వీకులను ప్రసన్నం చేసుకునే బాధ్యత వారసులదే. పూర్వీకులకు కోపం వస్తే మన జీవితంలో ఎన్నో విపత్తులు వస్తాయి. పూర్వీకుల శాపం మనపై పడినప్పుడు సమస్యలు కూడా ఎదురవుతాయి.

పూర్వీకులు మనపై కోపంగా ఉంటే దానిని పితృ దోషం అని చెబుతారు. పూర్వీకులు మనపై కోపంగా ఉంటే దురదృష్టం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా మానసిక సమస్యలు ఎదురవుతాయి. బృహత్ సంహిత ప్రకారం పూర్వీకులు మనపై కోపంగా ఉన్నారనేందుకు 7 సంకేతాలు చెప్పబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. పీడకలలు: చనిపోయిన కుటుంబ సభ్యులు కలలో వస్తే వారు మీపై కోపంగా ఉన్నారని అర్థం. పూర్వీకులు అసంతృప్తితో ఉన్నప్పుడే కలలో కనిపిస్తారు. పూర్వీకులను నిర్లక్ష్యం చేసినప్పుడు  కలలో కనిపిస్తుంటారు. అలాంటి సమయంలో వారిని పూజించడం అవసరం.

2. ఇంటి గోడలకు పగుళ్లు: అకస్మాత్తుగా ఇంటి గోడలకు పగుళ్లు వస్తే మాత్రం అది పూర్వీకల అసంతృప్తికి సంకేతంగా భావించాలి. ఇది రాబోయే కష్టాలు, ఆర్థిక నష్టాల గురించిన హెచ్చరికగా భావించాలి. ఇంట్లో పూర్వీకులు బ్రతికి ఉన్నప్పుడు ఉన్న ప్రదేశాలు, వారి ఫొటోలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. ఇలా చేయడం ద్వారా వారి కోపం తగ్గుతుంది.

3. ఎండిన మొక్కలు: ఇంట్లో ఉన్న మొక్కల సంరక్షణ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు ఎండిపోతాయి. ఇలా జరిగితే  పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని భావించాలి. పూర్వీకుల కోపం మొక్కలపై ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఇలాంటి సమయంలో శ్రాద్ధ కర్మలు చేయడంతో పాటు పూర్వీకులను స్మరించడం ద్వారా మంచి జరుగుతుంది.

4. ఆర్థిక సమస్యలు: ఆర్థిక సమస్యలు, పేదరికం కూడా పూర్వీకులు అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తాయి. జీవితంలో నిరంతర సమస్యలు వస్తున్నాయంటే దానికి అర్థం పూర్వీకులు మనపై కోపంగా ఉన్నారని అర్థం. పితృ పక్ష కర్మలను చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

5. వివరించలేని కష్టాలు, పనుల్లో అడ్డంకులు: ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవడం అనేది పూర్వీకులు అసంతృప్తిని సూచిస్తుంది. కోపంతో ఉన్న పూర్వీకులు కుటుంబ సభ్యుల పనులకు అడ్డంకులు సృష్టిస్తారని హిందువులు నమ్ముతారు. పితృ పక్షంలో కర్మలు చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

Also Read: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

6. మానసిక క్షోభ: వ్యక్తుల్లో తరుచూ ఆందోళన, నిరాశ అనేవి పూర్వీకులు అసంతృప్తితో ఉన్నారనడానికి సంకేతాలు. పూర్వీకుల కోపం మానసిక ప్రశాంతను దెబ్బతీస్తుంది. అందుకే పితృపక్షంలో పూర్వీకులకు సంబంధించిన ఆచారాలను నిర్వహించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.

7. అనారోగ్య సమస్యలు: పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అనారోగ్యాల పాలవుతారు. తరుచుగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అందుకే పితృపక్షంలో పూర్వీకులను స్మరించుకుంటూ వారికి శ్రాద్ధ పూజలు చేయాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×