War 2 vs HHVM: వీరమల్లును కూడా దాటలేకపోయిన వార్ 2టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ (NTR). ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఒకవైపు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. మరొకవైపు బాలీవుడ్ అరంగేట్రం చేస్తూ చేసిన చిత్రం వార్ 2 (War 2) . భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన హిందీ, తెలుగు, తమిళ్ భాషలలో ఈ సినిమా విడుదలయ్యింది. విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ కలెక్షన్స్ కూడా దాటలేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వార్ 2 కలెక్షన్స్ చూసి బాధపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత సినిమాలకు దాదాపుగా దూరం అయ్యారు అని చెప్పాలి. ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. రెండేళ్ల తర్వాత ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా మారిన తర్వాత చేసిన తొలి చిత్రం అయినా పలుమార్లు వాయిదా పడడం వల్ల పెద్దగా అంచనాలు కూడా ఉండేవి కాదు. అలా గత నెల విడుదలైన ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఎన్టీఆర్.. తాజాగా చేసిన వార్ 2 చిత్రం మాత్రం ఇప్పుడు వీరమల్లు కలెక్షన్స్ ని దాటకపోవడం గమనార్హం.
వీరమల్లు కలెక్షన్స్ లో సగం మాత్రమే..
ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అటు సీడెడ్ ఏరియాలో వార్ 2 సినిమా మొదటి రోజు కేవలం రూ.4.06 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం మొదటి రోజు ఏకంగా రూ.8.1 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీకే సీడెడ్ లో ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ సినిమాకి మాత్రం వీరమల్లు కలెక్షన్స్ లో సగం మాత్రమే రావడం ఏంటి? అని ఎన్టీఆర్ అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. మొత్తానికి అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ వెళ్లి చేతులు కాల్చుకున్న ఎన్టీఆర్..
వార్ 2 సినిమా విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో ఆదిత్య చోప్రా(Adithya chopra) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan), హీరోగా కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. ఇందులో విలన్ గా అదరగొట్టేశారు. కానీ ఈ సినిమా కంటెంట్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజే ఇంత తక్కువ కలెక్షన్లు అంటే ఇక రాను రాను ఏమాత్రం సక్సెస్ అవుతుందో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా బాలీవుడ్ వెళ్లి ఎన్టీఆర్ చేతులు కాల్చుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Ceded day1 collections#HHVM – 8.1Cr Gross 🔥🔥#War2 – 4.06Cr Gross
Least hyped movie tho Ceeded CM most hyped sequel ni Double ratio cheyadam enti ra mental @PawanKalyan 🤯💥🔥🥵#WAR2BuyersAbsconding pic.twitter.com/dRyCaIIjf1
— …. (@PKcultfanikkada) August 15, 2025
also read: Himaja: హిమజా లెమన్ టాస్క్.. నీళ్లు కిందపడకుండా ఆ నిమ్మకాయను పైకి తీయగలరా?