Watch video: క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు చరిత్రలో జరగని ఈ సన్నివేశాలు కూడా… ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. అయితే తాజాగా.. ఓ ప్లేయర్ విచిత్రంగా రనౌట్ అయ్యాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ… రిచర్డ్ అనే నెటిజన్… సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో ఆ క్రికెటర్ రన్ అవుట్ అయిన వీడియో చూస్తే అందరూ నవ్వుకోవాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.
ఇదెక్కడి రా నవ్వు రా నాయనా ?
క్రికెట్ చరిత్రలో రక రకాల రనౌట్స్ చూశాం. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే… మరికొన్ని రన్ అవుట్స్ వింతగా ఉంటాయి. ఇందులో కొన్ని రన్ అవుట్స్ అందరికీ నవ్వులు తెప్పిస్తాయి. ఇక తాజాగా ఓ రన్ అవుట్ చూస్తే.. అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలియదు కానీ….క్రిజు లోకి చేరుకున్నప్పటికీ బ్యాట్స్మెన్ నిర్లక్ష్యం కారణంగా రన్ అవుట్ అయ్యాడు. మొదట రన్ అవుట్ అయిన ఆటగాడు బౌలర్ వేసిన బంతిని… ముందుగా ఉన్న ఫీల్డర్ కు బాదేశాడు. ఫీల్డర్ చేతిలోకి బంతి వెళ్లినప్పటికీ రన్ తీసే ప్రయత్నం చేశాడు ఆటగాడు.
ఇంకే ముంది వెంటనే ఫ్రంట్ లో ఉన్న ఫీల్డర్.. వెంటనే ఆ బంతిని వికెట్ కీపర్ వైపు వేశాడు. కానీ వికెట్ కీపర్.. ఆ బంతిని అందుకోలేకపోయాడు. అతని కాలికి తగిలిన బంతి… నాన్ స్ట్రైక్ వైపు ఉన్న వికెట్లను తాగింది. అయితే.. నాన్ స్ట్రైక్ వైపు ఉన్న ప్లేయర్… ఆ బంతిని గమనించకుండా… క్రీజును వదిలి బయటకు వచ్చాడు. ఆ లోపే బంతి వికెట్లను గిరాటేసింది. ఈ నేపథ్యంలో… అక్కడే ఉన్న ఫీల్డర్లు అందరూ అప్పీల్ చేశారు. దీంతో వెంటనే ఫీల్డ్ అంపైర్… థర్డ్ అంపైర్ కు రివ్యూ కోసం ఇచ్చాడు. రివ్యూ చూసినా అనంతరం అవుట్ గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.
ఇక ఈ రన్ అవుట్ అయిన తర్వాత… బ్యాట్స్మెన్ షాక్ అయ్యాడు. అనవసరంగా క్రిజు వదిలి వెళ్లానని రియలైజ్ అయ్యాడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ అలాగే క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనను చూసి నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి రన్ అవుట్రా నాయనా… అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అనవసరంగా క్రిజు ను వదిలి బయటకు వెళ్లావు కదా…? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత.. ఇలాంటి రన్ అవుట్… జరిగి ఉంటుందని అంటున్నారు.
🚨 FIRST TIME IN CRICKET HISTORY 🚨
– You won't see this kind of run-out again in 100 years of cricket 😅
– A Must Watch Video 😂 pic.twitter.com/22wTjOCmVH
— Richard Kettleborough (@RichKettle07) August 15, 2025