Holi 2025: సనాతన ధర్మంలో హోలీ అతి పెద్ద పండగ మాత్రమే కాదు ముఖ్యమైన పండగ కూడా. రంగుల పండగగా పిలవబడే హోలీని ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ సారి హోలీ మార్చి 14 , 2025 న జరుపుకోనున్నాము. హోలీ దహనం పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుంది. హోలీ పండగనను అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.
హోలీ శుభ సమయం: పంచాంగం ప్రకారం ఈ ఏడాది పాల్గుణ మాసం పౌర్ణమి తేదీ మార్చి 13, 2025 న ఉదయం ప్రారంభం అవుతుంది. ఇది మార్చి 14 న మధ్యాహ్నం 12:23 కి ముగుస్తుంది. ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటే మాత్రం మార్చి 14న రాత్రి 11:26 నుండి 15 వ తేదీ తెల్లవారు జామున 12:30 వరకు. అంటే హోలీ దహనం మొత్తం సమయం దాదాపు 64 నిమిషాలు .
హోలీ పండగను ఎందుకు జరుపుకుంటారు ?
ఒక పురాణాల ప్రకారం పూర్వం హిరణ్యకశ్యప అనే రాక్షస చక్రవర్తి ఉండేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు ఇతడు విష్ణువు పట్ల అత్యంత భక్తితో ఉండేవాడు. అది రాజుకు నచ్చలేదు. హిరణ్యకశ్యపుడు తన ప్రజల మాదిరిగానే, తన కొడుకు కూడా తనను భగవంతుని రూపంగా అంగీకరించాలని కోరుకున్నాడు. కానీ అతను తన కొడుకును ఒప్పించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత తన కొడుకయిన ప్రహ్లాదుడిని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ విష్ణువు భక్తుడు కావడం వల్ల ప్రహ్లాదునికి ఏమీ జరగలేదు. చివరగా, హిరణ్యకశ్యపుడు తన సోదరి హోలికను ప్రహ్లాదుని ఒడిలో ఉంచుకుని అగ్నిలో కూర్చోమని కోరాడు. ఇలా ప్రహ్లాదుడు మరణించాడు.
నిజానికి, హోలికకు బ్రహ్మ దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆమె అగ్నిలో కాలిపోదు. అందువల్ల, హిరణ్యకశ్యపుని ఆజ్ఞ మేరకు ఆమె ప్రహ్లాదుడితో కలిసి అగ్నిలో కూర్చుంది. కానీ విష్ణువు దయ ఎంతగా ఉందంటే హోలిక అగ్నికి ఆహుతి అయి మరణించింది. కానీ ప్రహ్లాదుడు మళ్ళీ రక్షించబడ్డాడు. అందుకే ప్రతి సంవత్సరం హోలిక దహనం చేస్తారు.
దీపావళి తర్వాత హిందువులు రెండవ అతిపెద్ద పండుగ అయిన హోలీని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్రం ప్రకారం, హోలీ రోజున తమ తమ రాశి ప్రకారం వివిధ రంగుల దుస్తులు ధరిస్తే, అది వారికి శుభ ఫలితాలను తెస్తుంది. మరి ఏ రాశుల వారు ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఆ రాశి వారు ఇవాళ శుభవార్తలు వింటారు – చేపట్టిన పనుల్లో విజయం
– ప్రేమ, శక్తికి చిహ్నంగా చెప్పబడే హోలీ రోజున మేష రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల శుభం జరుగుతుంది.
– వృషభ రాశి వారు హోలీ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం శుభం, ఇది శాంతి, స్వచ్ఛతకు చిహ్నంగా చెబుతారు.
– కొత్త జీవితానికి చిహ్నంగా చెప్పబడే హోలీ రోజున మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది.
– కర్కాటక రాశి వారు తెల్లటి దుస్తులు ధరించి హోలీ ఆడాలి. ఈ రంగు శాంతి , స్వచ్ఛతను సూచిస్తుంది.
– సింహ రాశి వారు హోలీ నాడు పసుపు, నారింజ, ముదురు ఎరుపు ,బంగారు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం.
– కన్యా రాశి వారు ఆకుపచ్చ, గోధుమ, నారింజ రంగు దుస్తులు ధరించి హోలీ ఆడాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
– తులా రాశి వారు తెలుపు , గులాబీ రంగు దుస్తులు ధరించి హోలీ ఆడాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం.
– వృశ్చిక రాశి వారు ఎరుపు, మెరూన్ , పసుపు రంగు దుస్తులు ధరించి హోలీ జరుపుకోవాలి.
– ధనస్సు రాశి వారు ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులు ధరించి హోలీ జరుపుకోవాలి. ఇది మీకు ఆనందాన్ని తెస్తుంది.
– మకర రాశి వారు నీలం , నలుపు రంగు దుస్తులు ధరించి హోలీ జరుపుకోవాలి. ఇది శుభప్రదంగా ఉంటుంది.
– కుంభ రాశి వారు హోలీ రోజున నీలం లేదా ముదురు రంగు దుస్తులు ధరించాలి. ఇది వారి రాశి అధిపతి శనిని సంతోష పరుస్తుంది.
– మీన రాశి వారు హోలీ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి హోలీ ఆడాలి. ఇది రాశి అధిపతి అయిన బృహస్పతిని సంతోష పరుస్తుంది.