BigTV English

Horoscope December 07 :  ఆ రాశి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు – కానీ ఆ విషయంలో జాగ్రత్త

Horoscope December 07 :  ఆ రాశి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు – కానీ ఆ విషయంలో జాగ్రత్త

Horoscope December 07  :  గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 5న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  ఇవాళ ఈ రాశి వారికి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు.  ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభ రాశి:   ఈ రాశి వారికి ఇవాళ  సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.


మిథున రాశి:  ఈ రాశి వారికి ఇవాళ  ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన  వాహనయోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటక రాశి:   ఈ రాశి వారికి ఇవాళ  ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహ రాశి:  ఈ రాశి వారికి ఇవాళ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

కన్య రాశి:  ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో  ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన పనులలో  వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి.

 వృశ్చిక రాశి:  ఈ రాశి వారు ఇవాళ ఇంట్లో  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఇవాళ కీలకమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట  ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకర రాశి:  ఈ రాశి వారికి ఇవాళ అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి.

కుంభ రాశి:  ఈ రాశి వారికి ఇవాళ నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి.  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా  సాగుతాయి.

మీన రాశి:  ఈ రాశి వారికి ఇవాళ ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×