BigTV English

Subsidy on Tickets: బాబోయ్.. అన్ని కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!

Subsidy on Tickets: బాబోయ్.. అన్ని కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!

Railways Subsidy: రైల్వే ప్రయాణం చేయాలంటే మనం ముందుగా టికెట్ తీసుకుంటాం. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అయితే, మనం కొనుగోలు చేసే ప్రతి టికెట్ మీద కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తున్నది. ఒక్కో టికెట్ పై ఏకంగా 46 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.


ఏడాదికి రూ. 56,993 కోట్ల సబ్సిడీ

తాజాగా లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో షోలాపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రణితి షిండే.. క్రీడాకారులకు రైల్వే ప్రయాణం విషయంలో ఎలాంటి రాయితీలు ఇస్తున్నారో చెప్పాలని కోరారు. క్రీడాకారులు ఆయా స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని, వారికి ప్రత్యేకు రాయితీలు ఇస్తే బాగుంటుందని ప్రణితి షిండే అభిప్రాయపడ్డారు. ఈ ప్రశ్నకు ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. “రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణీకులకు  సబ్సిడీ కోసం ప్రతి సంవత్సరం రూ. 56,993 కోట్లు ఖర్చు చేస్తున్నది. వృద్ధులు, గుర్తింపు పొందిన జర్నలిస్టులకు సబ్సిడీలను అందిస్తున్నది. ప్రతి రూ.100 ప్రయాణ సర్వీస్ కు ప్రయాణీకుల నుంచి కేవలం రూ. 54 మాత్రమే వసూలు చేస్తున్నది. ప్రభుత్వం సబ్సిడీ అందించే వారిలో క్రీడాకారులు కూడా ఉన్నారు” అని రైల్వే మంత్రి వెల్లడించారు.


దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి

అటు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిన్న, మధ్య తరహా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. “దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో దేశం మొత్తం రోడ్ల ద్వారా అనుసంధానించడింది. ఇప్పుడు మోడీ సర్కారు దేశంలోని చిన్న, మధ్య తరహా రైల్వే స్టేషన్లను అద్భుంగా అభివృద్ధి చేస్తున్నాం. దేశం అంతటినీ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం” అని లోక్ సభలో అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read Also: స్పీడు పెంచిన వందే భారత్.. ఈ రూట్లో మరింత వేగంగా గమ్యానికి, ఎంత టైమ్ తగ్గుతుందంటే..

రైల్వే టికెట్స్ మీద సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని మోడీ పిలుపు

అటు కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ల మీద ఇస్తున్న సబ్సిడీని వదులకునే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ వదులుకున్నట్లుగానే, టికెట్ల మీద కూడా సబ్సిడీని వదులుకోవచ్చు. ఇందుకోసమే  కేంద్ర ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ అనే స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే సమయంలో టికెట్ మీద సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అయితే, సబ్సిడీని వదులుకునే వారు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరతో పోల్చితే ఇంచుమించు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారతీయ రైల్వే సంస్థ ప్రతి ఏటా టికెట్లను విక్రయించడం ద్వారా రూ. 60 వేల కోట్ల ఆదాయాన్ని అర్జిస్తున్నది. ‘గివ్ ఇట్ అప్’ స్కీమ్ లో భాగంగా సబ్సిడీ వదులుకునే వారితో సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also:వెయిటింగ్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తున్నారా? కేంద్ర మంత్రి సీరియస్ వార్నింగ్!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×