BigTV English
Advertisement

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు..!

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు..!

Today Horoscope: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ రాశి వారు ఎలాంటి పనులు చేయకూడదు వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చిత్తశుద్ధితో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. అన్ని రంగాల వారికి ఇబ్బందులు ఎదురుకావొచ్చు. కొన్ని కీలక వ్యవహారాల్లో నిరాశ చెందుతారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.


మిథునం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. అనవసరమైన విషయాలపై దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహాలు ఇబ్బందులు పెడతాయి. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. దుర్గాధ్యాన శ్లోకాన్ని చదవడం అన్ని విధాలుగా మంచిది.

Also Read:  Planets For Happy Life: ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉంటే జీవితమంతా సంతోషమయం

 

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరి అధిగమిస్తారు. అన్ని రంగాల వారు తిరుగులేని విజయం సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ప్రయాణాలు ఉంటాయి. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

సింహం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి. శారీరక శ్రమ పెరగవచ్చు. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం శుభప్రదం.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. పెద్దల సలహాలతో పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో పురోగతితోపాటు ఉహించని లాభాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. దైవబలం ఉంటుంది. గణపతి ఆలయాన్ని సందర్శించాలి.

Also Read: Lakshmi Narayan Rajyog: లక్ష్మీ-నారాయణ యోగంతో 3 రాశుల వారి జీవితాల్లో గొప్ప పురోగతి..

తుల:
తుల రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాలు ఉంటాయి. శారీరక శ్రమ, ఒత్తిడి పెరగవచ్చు. పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో వాదనలు పెట్టుకోవద్దు. తోటివారిని కలుపుకొని పనిచేయాలి. ఆర్థిక మోసాలపై అవగాహన పెంచుకోవాలి. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల వారికి లాభాలు, పురోగతి ఉంటుంది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన మానవద్దు.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. పెండింగ్ బకాయిలు చేతి అందుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం మంచిది.

Also Read: Sun Transit 2024: ఈ రాశుల వారి జీవితం మరికొన్ని రోజుల్లో మారిపోబోతుంది..

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వారు అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇతరులతో వాదనలకు దిగకపోవడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. శివ స్తోత్రం సత్ఫలితాలు ఇస్తుంది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారు మంచి లాభాలు గడిస్తారు. సకాలంలో సహాయం అందుతుంది. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఆర్థిక నష్టం జరగే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడుతారు. శివారాధన చేయడం మంచిది.

Related News

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Big Stories

×