Horoscope Aquarius 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. కుంభ రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం కుంభ రాశి జాతకులకు ఆదాయం -8, వ్యయం-14గా ఉంది. అంటే ఎనిమిది రూపాయలు సంపాదిస్తే.. 14 రూపాయలు ఖర్చు చేస్తారు. ధన పరంగా మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇక రాజ్యపూజ్యం-7, అవమానం -5 గా ఉంది. అంటే ఏడు మంది మీకు గౌరవం ఇస్తే.. ఐదు మంది మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో ప్రభుత్వం నుంచి రావలసిన రుణాలు అందుతాయి. ట్రావెల్స్, టూరిజం, మిలటరీ, విద్యుత్తు, కుమ్మరి, ఇటుక రంగాల వారికి ఈ నెలంతా యోగదాయకంగా ఉంటుంది.
ఫిబ్రవరి : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో మానసికంగా ఇబ్బందులు పడతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రతలు తీసుకోవాలి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఈసంతృప్తిగా ఉంటుంది.
మార్చి : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కానీ కార్మికులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. భార్య తరపు బంధువుల నుంచి అనుకూలత తగ్గుతుంది. కుటుంబంలో చికాకులు కలిగినను వాటిని సర్దుబాటు చేసుకుంటారు.
ఏప్రిల్ : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో చేయు వృత్తి ఉద్యోగాలలో అసహనంగా ఉంటారు. ఉదర సంబంధ ఇబ్బందులు, అనారోగ్య లక్షణాలు తగ్గిపోయి మనస్సులో ఉత్సాహం కలుగుతుంది.
మే : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. కొడుకుల వలన ఇష్టమైన కోరికలు నెరవేరును. కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కొంతమేర అనుకూలత తగ్గుతుంది.
జూన్ : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో పై అధికారు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో చిన్నచిన్న అవరోధాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకొవడం మంచిది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో ప్రయత్నించిన కార్యములు నెరవేరుతాయి. ధన ధాన్య లాభములు కలుగుతాయి. ఉద్యోగములో తోటివారితో విభేదములు నెలకొంటాయి. వైద్యులకు, వృత్తి పనివాళ్లకు, రాజకీయ నాయకులకు ఈ నెలంగా పరీక్షా కాలంగా ఉంటుంది.
ఆగష్టు : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో విద్య, వైద్య, కంప్యూటర్ వృత్తుల వారికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
సెప్టెంబర్: కుంభ రాశి జాతకులకు ఈ నెలలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. జీవనంలో మాధుర్యాన్ని అనుభవించలేకపోవడం, శారీరక కష్టాలు అనుభవిస్తారు. అవయవ బాధలు పడతారు. కొన్ని సందర్బాలలో రక్తస్రావము అయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్ : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో దైవ సంబంధ కార్యములలో పాల్గొటారు. ఇబ్బందులను సైతం లెక్కచేయక ఆత్మ విశ్వాసంతో పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులు అధిక శ్రమచేత ఉత్తీర్ణత సాధిస్తారు.
నవంబర్: కుంభ రాశి జాతకులకు ఈ నెలలో ఇతరులపై కోపము వీడి సర్వ కార్యాలు చక్కబెట్టగలరు. ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతుంది. ఇష్ట కార్యములు సిద్ధిస్తాయి. వైద్యులకు, వృత్తి పనివాళ్లకు, నాయకులకు ఈ నెలంతా పరీక్షా కాలంగా ఉంటుంది. :
డిసెంబర్ : కుంభ రాశి జాతకులకు ఈ నెలలో సరైన ఉద్యోగం లభిస్తుంది. అధికారం సిద్దిస్తుంది. ఇంటికి బంధు, మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వర్తక వాణిజ్య వ్యవసాయములలో కృషి ఫలించుటచే ఆదాయము పెరుగుతుంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?