Moto G05 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటో.. త్వరలోనే మరో కొత్త మెుబైల్ ను లాంఛ్ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. Moto G05 పేరుతో రాబోతున్న ఈ మెుబైల్ ను జనవరి 7న లాంఛ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Motorola భారత్ లో కొత్త G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Moto G05 పేరుతో గత నెలలో ప్రపంచ మార్కెట్లలోకి లాంఛ్ అయిన మెుబైల్ ను ఇప్పుడు ఇండియాలో ప్రారంభించటానికి సిద్ధమవుతుంది. ఇక 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన Moto G04కి సక్సెసర్‌గా రానుంది. అయితే మోటో అధికారికంగా ప్రకటించక ముందే ఫ్లిప్‌కార్ట్ దాని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తూ Moto G05 స్పెషిఫికేషన్స్ ను ఉంచింది.
Moto G05 ఇండియా లాంచ్ తేదీ –
Moto G05 ఇండియాలో జనవరి 7న లాంఛ్ కాబోతుంది. ఇక ఈ లాంఛ్ ఈవెంట్ లో స్మార్ట్‌ఫోన్ ధర, మార్కెట్ లాంఛ్ డేట్ విడుదలకానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మెుబైల్ ధర రూ. 6,999గా ఉండటంతో.. రూ.10వేలలోపే కొనగలిగే బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా ఈ మెుబైల్ నిలవనుంది.
Moto G05 ఫీచర్స్ –
Moto G05 90Hz రిఫ్రెష్ రేట్, 1,000 nits పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 3, వాటర్ టచ్ టెక్నాలజీతో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. ఇది వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఆకుపచ్చ, ఎరుపు రంగులలో అందుబాటులో ఉంటుంది . ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వెనుకవైపు కెమెరా ఐలాండ్ సైతం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ స్నాపర్ సైతం ఉన్నాయి. ఇది Dolby Atmos, Hi-Res ఆడియోతో వచ్చేస్తుంది. Moto G05 MediaTek Helio G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్ తో రానుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ALSO READ : వాట్సాప్ తోనే ఎక్కువ మోసాలు, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!