BigTV English

Horoscope Sagittarius 2025 :  ధనస్సు రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope Sagittarius 2025 :  ధనస్సు రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope Sagittarius 2025 :   గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. ధనస్సు రాశి  జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం వృశ్చిక రాశి  జాతకులకు ఆదాయం -5, వ్యయం-5గా ఉంది. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారని అర్థం. ధన పరంగా ధనస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  ఇక రాజ్యపూజ్యం-1,  అవమానం -5 గా ఉంది. అంటే  ఒక్కరు మీకు గౌరవం ఇస్తే.. ఐదు మంది మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


జనవరి : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో ఇంట్లో  సంతోషకరమైన వార్తలు వింటారు.  వ్యాపారంలో శుభ పరిణామాలు జరుగుతాయి.  అభివృద్ధి కలుగుతుంది. సంతానం విషయంలో కఠినంగా వ్యవహరించరాదు.

ఫిబ్రవరి: ధనస్సు రాశి జాతకులు ఈ నెలలో నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసే వారికి శ్రమ అధికంగా ఉంటుంది. యంత్ర, కర్మాగారం వారికి, కార్మికులకు వృత్తి పరమైన ఒత్తిడి ఉంటుంది. బిల్డింగ్ కాంట్రార్లకు చాలా బాగుంటుంది.


మార్చి : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో  ఎరువులు, క్రిమిసంహారిక మందులు విక్రయదారులకు అనుకూలతలుండవు. ఒక్కో సందర్భములో ఏ నిర్ణయము తీసుకొలేరు. పిల్లల టెక్నికల్ విద్యయందు శ్రద్ధ వహిస్తారు.

ఏప్రిల్ : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో  కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. ధనం వృధాగా ఖర్చు చేస్తారు. చేసే పనులలో అడ్డంకులు, అవరోధాలు ఏర్పడతాయి. శివాలయంలో అభిషేకం చేయడం వలన  మేలు జరుగుతుంది.

మే :  ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో  వస్త్ర లాభం, ధన లాభం ఉంది. విద్యార్థులకు ఈ మాసం అనుకూంగా ఉంటుంది. ప్రతి విద్యలోను మంచి మార్కులు సాధిస్తారు. చేసే వృత్తిలో రాణిస్తారు. క్రీడారంగం వారు ఈ నెలలో బాగా రాణిస్తారు.

జూన్ : ధనస్సు రాశి జాతకులు ఈ నెలలో  ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తోటి ఉద్యోగులతో దూర ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. పాలు, పెరుగు, పాడి పరిశ్రమల వారికి కొద్దిగా వ్యాపారం తగ్గుతుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

జూలై : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో   అధిక లాభాలు ఉన్నాయి.. ప్రయత్నించిన పనులలో సానుకూలత ఏర్పడుతుంది. శత్రువుల పోరు తొలగిపోతుంది. చేస్తున్న వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ధనము, కీర్తి, హృదయ సౌఖ్యము, యశోవృద్ది ఉన్నాయి.

ఆగష్టు : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో  సంసారంలో సంతోషాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ధనలాభము, కుటుంబ గౌరవము, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి.  ప్రతి విషయం అనుకూలంగా ఉంటుంది.

సెప్టెంబర్ : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో   స్థానభ్రంశము, దరిద్రమును, ధన నాశనము, శత్రు భయము, అన్ని పనులలో అవరోధాలు ఎదురవుతాయి. నెల చివరిలో స్వల్ప ధన లాభము కలుగును. విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణతను సాధించెదరు.

అక్టోబర్: ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో   ఎప్పటి నుంచో పెండింగ్‌ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సంస్థలను అధిరోహించి అభివృద్ది సాధిస్తారు. నెలంతా అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధన లాభము ఉంది.

నవంబర్ : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో   దైవ బలం తోడై సర్వకార్యసిద్ధి కలుగుతుంటే పుష్కలమగు శరీర కాంతి. ఆరోగ్యము వెల్లివిరియును. స్థాన భ్రంశము దరిద్రమునూ, ధననాశనము, నేత్ర బాధయును, శత్రు భయము అన్ని కార్యములయందు విఘ్నములు కలుగును.

డిసెంబర్ : ధనస్సు రాశి జాతకులకు ఈ నెలలో  ఆదాయం వృద్ధి చెందుతుంది.  దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్లు ఉన్నాయి.  అన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×