Drinker Sai Movie :ప్రస్తుత కాలంలో చాలామంది టాలెంట్ ఉండి కూడా.. ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి చూద్దాం ఏమవుతుందో అనే ధైర్యంతో వస్తున్నారు. అలా ఒక్క అడుగుతో తమ టాలెంట్ ను నిరూపించి, మంచి పేరు సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హీరో ధర్మ (Dharma) కూడా ఒకరు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతిభ ఉండి ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది అనడానికి ధర్మా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ తెలుగు ప్రేక్షకులే వారిని స్టార్స్ చేస్తారనడంలో సందేహం లేదు. పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తే చాలు ఆదరణ చూపిస్తారు.
‘డ్రింకర్ సాయి’తో యువ హీరో ఇండస్ట్రీకి పరిచయం..
ఇక అందులో భాగంగానే తన మొదటి చిత్రం ‘డ్రింకర్ సాయి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు యువ హీరో ధర్మ. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ‘డ్రింకర్ సాయి’ అనే సినిమా.. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. డ్రింకర్ సాయి సినిమాలో హీరో ధర్మ తన డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నారు. సాయి పాత్రలో ధర్మా చేసిన పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీజింగ్, ఫన్, ఎమోషనల్ సన్నివేశాలలో చాలా మెచ్యూర్ గా నటించారు ధర్మ. ఒకరకంగా చెప్పాలి అంటే ధర్మాకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో లాగానే నటించాడు అనడంలో సందేహం లేదు. ధర్మ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కి అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
మొదటి సినిమాతోనే స్ట్రాంగ్ పునాది..
ఇకపోతే ధర్మ నటనను చూసిన చాలా మంది సినీ విశ్లేషకులు కూడా మరో ప్రామిసింగ్ యంగ్ హీరో టాలీవుడ్ కి దొరికేశాడు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే డ్రింకర్ సాయి సినిమాతో ధర్మ తన కెరీర్ కు స్ట్రాంగ్ పునాది వేసుకున్నారు అనడంలో సందేహం లేదు. ఇక ఇలా టాలెంట్ ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రీ అండగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఇలా ఎంతోమంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎదిగారు. ఇప్పుడు ఆ జాబితాలోకి హీరో ధర్మ కూడా వచ్చి చేరిపోయారు అనడంలో సందేహం లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.