Indian Doctor UAE Plane Crash| ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రష్యాలోని గ్రోజ్నీ, దక్షిణ కొరియాలో రెండు భారీ విమాన ప్రమాదాలు జరిగాయి. రష్యాలో విమానం కూలిపోవడంతో దాదాపు 70 మంది చనిపోగా.. దక్షిణ కొరియాలో జరిగిన భారీ విమాన ప్రమాంలో ఏకంగా 178 మంది మంటల్లో చనిపోయారు. తాజాగా మూడు రోజుల క్రితం దుబాయ్ సమీపంలో కూడా ఒక చిన్న విమానం కూలిపోయింది. ఇందులో ఉన్న ఇద్దరూ మరణించారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు భారత సంతతికి చెందిన డాక్టర్ కావడం మరి విషాదకరం.
వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్ పక్కనే ఉన్న రాస్ అల్ ఖైమా ఎమిరేట్ లో గురువారం డిసెంబర్ 26, 2024న ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.
చనిపోయిన ఇద్దరిలో విమానంలో కోపైలట్ గా ఉన్న వ్యక్తి సులేమాన్ అల్ మాజిద్ అనే యువకుడు భారత దేశంలోని బెంగుళూరుకి చెందినవాడు. కానీ అతని చిన్నతనంలోనే కుటుంబమంతా యుఎఇ దేశానికి వలస వెళ్లింది. బాల్యం యుఎఇ దేశంలోనే గడిపిన సులేమాన్ ఆ తరువాత యుకె దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ లో ఫెలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతను బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ ఆ తరువాత హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో చైర్మన్ పదవులు చేపట్టాడు. యుకెలో తాను డాక్టర్ గా అక్కడ జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని పోరాటం కూడా చేశాడని సమాచారం.
అయితే ఇటీవల సులేమాన్ యుఎఇకి తిరిగి వెళ్లి తన కుటుంబంతో సరదాగా కొంత సమయం గడిపాడు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. ఆ విమానం పైలట్ ఒక పాకిస్తానీ మహిళ. ఆమెతో కలిసి సులేమాన్ ఆ విమానంలో గాల్లో ఎగిరిపోయాడు. అతని కోసం క్లబ్ కు చెందిన ప్రైవేట్ విమాన రన్ వే అతని కుటుంబం ఎదురు చూస్తూ ఉంది. సులేమాన్ తిరిగి వచ్చాక.. అతని తమ్ముడు వెళ్లాలని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నాడు.
Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..
ఈ క్రమంలో విమానం నుంచి రేడియో కాంటాక్ట్ (సంప్రదింపులు) రావడం లేదని అధికారులు తెలిపారు. ఏం జరగుతోందోనని అతని కుటుంబం ఆందోళన చెందుతుండగా.. విమానం ఒక్కసారిగా సమీపంలోని కోవ్ రొటానా హోటల్ సమీపంలోని ఒక బీబ్ లో కుప్పకూలింది. దీంతో వెంటనే సాయక బృందం చర్యలు చేపట్టింది. విమానం నుంచి ఇద్దరినీ బయటికి తీసి ఆస్పత్రి తరలించారు. కానీ సులేమాన్ తోపాటు ఆ పాకిస్తానీ మహిళా పైలట్ ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు.
ఈ ఘటన గురించి సులేమాన్ తండ్రి మాట్లాడుతూ.. తమ కొడుకుతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు, త్వరలోనే అతడి పెళ్లి చేయాలనుకున్నాం. కానీ మా జీవితాల్లో విషాదం నింపి వెళ్లిపోయాడు. సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదని చెప్పారు.