E-Paper
Advertisement

Horoscope  Today December 26th:  ఆ రాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది

Horoscope  Today December 26th:  ఆ రాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 26న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు. మీ పిల్లలు మీమాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాత బుణాలు కొంత వరకు తీరుస్తారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిదికాదు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఇంట బయట సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలులో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో  అవరోధాలు ఉంటాయి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందుల వలన  బాధలు పెరుగుతాయి. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘ కాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు  సన్నిహితుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమములు ప్రారంభిస్తారు. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×