మూవీ : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
రిలీజ్ డేట్ : 25 Dec 2024
డైరెక్టర్ : రైటర్ మోహన్
నిర్మాత : వెన్నపూస రమణా రెడ్డి
నటీనటులు : వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సియా గౌతంతో పాటు తదితరులు
Srikakulam Sherlock Holmes Movie Rating : 2/5
Srikakulam Sherlock Holmes Movie Review : వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. కానీ ఇటీవల క వంటి బ్లాక్ బస్టర్ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడంతో కొంతమంది దృష్టి పడింది. పైగా ప్రీ రిలీజ్ వేడుకలో ‘ సినిమా నచ్చకపోతే నాకు ఫోన్ చేయండి అంటూ నంబర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందో లేదో చూద్దాం రండి :
కథ :
ఓం ప్రకాష్(వెన్నెల కిషోర్) శ్రీకాకుళంకి చెందిన షెర్లాక్ హోమ్స్ గా పిలవబడుతూ ఉంటాడు. డిటెక్టివ్ కావడంతో అంతా అతన్ని పిలుస్తారు. చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఒకసారి వైజాగ్ మర్డర్ కేసు సాల్వ్ చేసే అవకాశం వస్తుంది. ఆ కేసు సాల్వ్ చేసే ప్రాసెస్లో 7 మంది పై ఓం ప్రకాష్ అనుమాన పడతాడు. వాళ్ళే బాలకృష్ణ(రవితేజ మహాదాస్యం) భ్రమరాంబ(అనన్య నాగళ్ళ) రమేష్ పట్నాయక్(ప్రభాకర్) మొదలగువారు.ఈ 7 మంది వల్ల ఓం ప్రకాష్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అసలు ఈ వైజాగ్ మర్డర్ కేసు ఏంటి? అక్కడ మరణించింది ఎవరు? చివరికి ముద్దాయిని ఓం ప్రకాష్ పెట్టుకున్నాడా? లేదా? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మిగిలిన కథగా చెప్పుకోవాలి.
విశ్లేషణ :
క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది.సస్పెన్స్ తో కూడుకున్న స్క్రీన్ ప్లే ఉంటే జనాలు టికెట్లు పెట్టడానికి రెడీగానే ఉంటున్నారు. కానీ ఈరోజుల్ క్రైమ్ థ్రిల్లర్లు తీసే దర్శకులు చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఓటీటీల్లోనే బోలెడన్ని థ్రిల్లర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.భాషతో సంబంధం లేకుండా వాటిని ప్రేక్షకులు చూసేస్తున్నారు. మరో రకంగా చూసుకుంటే చివరికి విలన్ ఎవరు? అనేది కూడా ముందుగానే గెస్ చేసేస్తున్నారు. అందుకే దర్శకులు స్క్రిప్ట్ దశలోనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా విషయంలో దర్శకుడు మోహన్ పగడ్బందీ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు. కానీ దానిని తెరపై ఆవిష్కరించే విషయంలో అతను తడబడ్డాడు. సీరియస్ గా సాగాల్సిన చోట సిల్లీ కామెడీ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ కూడా చాలా స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ ఓకే. సెకండ్ హాఫ్ మొదటి 5 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ తర్వాత చాలా బోర్ కొడుతోంది. క్లైమాక్స్ కోసం దాచుతున్న ట్విస్ట్..లు ఇంపాక్ట్ చూపవు. ఎడిటింగ్ లోపాలు కనిపించాయి. సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఇంపాక్ట్ చూపదు.
నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు. వెన్నెల కిషోర్ తో ఇలాంటి పాత్ర చేయించొచ్చు అనేది కూడా మంచి ఆలోచనే. కానీ డిటెక్టివ్ గా వెన్నెల కిషోర్ కొత్తగా చేసింది ఏమీ లేదు. కాల్షీట్లు కూడా తక్కువగా ఇచ్చాడేమో.. హడావిడి హడావిడిగా ఇతని పాత్రని తెవిల్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అనన్య నాగళ్ళ పాత్ర ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. కానీ తర్వాత ఆమె రెగ్యులర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లా కనిపిస్తుంది. ‘సగిలేటి కథ’ ఫేమ్ రవితేజ పాత్ర కూడా సాదాసీదాగా ఉంది. సియా గౌతమ్ కి మంచి పాత్ర దొరికింది. మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే.
ప్లస్ పాయింట్స్ :
ఒకటి రెండు ట్విస్టులు
క్లైమాక్స్
రన్ టైం 2 గంటలే ఉండటం
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్
సిల్లీ కామెడీ
మొత్తంగా ఈ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అక్కడక్కడ కొన్ని మెరుపులు మెరిపించినా.. డీసెంట్ థ్రిల్లర్ మూవీ. ఓపిక ఉంటే తప్ప చివరి వరకు కూర్చోవడం కష్టం.
Srikakulam Sherlock Holmes Movie Rating : 2.75/5