E-Paper
Advertisement

Horoscope  Today December 27th:   ఆ రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి

Horoscope  Today December 27th:   ఆ రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 27న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్రలాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. మిత్రుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహం పొందుతారు.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో   అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు, వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు.

మీన రాశి : ఈ రాశి వారు ఈరోజు  కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×