Nindu Noorella Saavasam Serial Today Episode : ఆరు తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నానని.. స్వామిజీకి చెప్తాడు. అయితే వాళ్లకు నిజం చెప్పావా..? అమరేంద్ర అని స్వామిజీ అడుగుతాడు. లేదని తన కూతురు లేదన్న నిజం చెప్పి వాళ్లు ఈ వయసులో బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదని అమర్ చెప్పగానే అవునా మంచి పని చేశావు అంటాడు స్వామిజీ. అయితే రెండు రోజుల్లో ఆరు వెళ్లిపోతుంది కదా..? ఆలోపు తనకు ఈ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. తను చావులో ఇవ్వలేని సంతోషాన్ని మోక్షంలోనైనా ఇవ్వాలనుకుంటున్నాను.
ఆరుంధతి ఆత్మ మా ఇంటి చుట్టే ఉంటుంది అంటే కచ్చితంగా మమ్మల్ని చూస్తూ ఉంటుంది. మా మాటలు వింటుంది. ఈ విషయం నేను అరుంధతి ఎలా చెప్పాలి. తనతో మాట్లాడే మార్తం ఏదైనా ఉందా..? స్వామిజీ అని అమర్ అడగ్గానే ఉంది అమరేంద్ర అని స్వామిజీ చెప్పగానే అమర్ ఆత్రుతగా స్వామిజీ నేను ఎలా చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి. తను నా పక్కన ఉందని ఎలా తెలుస్తుంది. అని అమర్ అడగ్గానే.. పంచభూతాలు నీకు సంకేతాన్ని తెలుపుతాయి. నీ మనసుకు అరుంధతి పక్కనే ఉందని అనిపించినప్పుడు నిజం చెప్పు. ఒక భర్తగా నువ్వు అన్ని కర్తవ్యాలను పూర్తి చేశావు. అమ్మాయి ఆస్థికలు తీసుకుని ఇంటికి వెళ్లి.. ఫోటో ముందు దీపం పెట్టి పూజ చేయి. అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. అని చెప్పగానే అమర్ అలాగే స్వామి అని వెళ్లొస్తానని చెప్తాడు.
అమర్ రూంలో ఆరు ఫోటో కోసం వెతుకుతుంది మిస్సమ్మ. ఎంత వెతికినా ఫోటో దొరకదు మిస్సమ్మకు. అంజు, ఆరు ఫోటో తీసుకెళ్లి రూంలో కూర్చుని ఏడుస్తూ చూస్తుంది. ఇంతలో అమ్ము, ఆకాష్, ఆనంద్ వచ్చి చూస్తారు. ఏమైందని అడుగుతారు. అమ్మకు మనమంటే ఇష్టమే కదా..? మరి అమ్మ మనకు కనిపించకుండా.. ఆ మిస్సమ్మకు కనిపించడం ఏంటి..? అని అడుగుతుంది. అవునని అమ్ము, ఆకాష్, ఆనంద్ అనుమానిస్తారు. ఇంతలో ఆలోచిస్తూ కిందకు వెళ్లిన మిస్సమ్మను ఏం వెతుకుతున్నావని నిర్మల, శివరాం అడుగుతారు.
ఆరు అక్క ఫోటో కోసం వెతుకుతున్నాను అని చెప్తుంది మిస్సమ్మ. ఆయన రూంలో ఎంత వెతికినా దొరకడం లేదని చెప్పగానే.. ఎప్పుడో ఆ పొట్టి రాణి తమ రూంలోకి తీసుకెళ్లిందని శివరాం చెప్తాడు. అయినా ఆరు ఫోటో ఇప్పుడెందుకు మిస్సమ్మ అని నిర్మల అడుగుతుంది. అక్క ఆస్థికలు నదిలో కలిపే వరకు ఫోటో హాల్ లో పెదడామనుకుంటున్నాను అని మిస్సమ్మ చెప్పగానే పెద్ద మనసుతో ఆలోచించి ఇంకా పెద్ద దానివి అయిపోయావు మిస్సమ్మ అంటాడు శివరాం. ఇంతలో మిస్సమ్మ పిల్లల రూంలోకి వెళ్తుంది. పైన పిల్లలు కూడా మిస్సమ్మ దగ్గరకు వెళ్దామని వెళ్లబోతుంటే మిస్సమ్మ ఎదురవుతుంది. మేము నీకోసమే వస్తున్నాం మిస్సమ్మ అని ఆకాష్ చెప్పగానే అవునా నేను కూడా మీ కోసమే వస్తున్నాను అంటుంది మిస్సమ్మ.
అవునా ఎందుకు ముందు నువ్వే చెప్పు అంటాడు ఆనంద్. అంజు చేతిలో ఉన్న ఫోటోను చూస్తూ అక్క ఫోటో కోసం అని చెప్తుంది మిస్సమ్మ. దీంతో అమ్ము అమ్మ ఫోటో కోసమా అంటూ అడగ్గానే ఊరికే చూడటానికి.. అలాగే హాల్ లో పెట్టడానికి అని చెప్తుంది మిస్సమ్మ. అయితే సరే తీసుకో అని అంజు ఫోటో ఇవ్వబోతూ.. లాక్కుని ముందు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెబితే ఫోటో ఇస్తాను అంటుంది. అక్కతో మాట్లాడాను అని మిస్సమ్మ చెప్పగానే పిల్లలు షాక్ అవుతారు. అదే పక్కింటి అక్కతో మాట్లాడాను అంటుంది. అంజు కోపంగా లేదు నువ్వు మా అమ్మతో మాట్లాడుతున్నాను అన్నావు అంటుంది. అదా నేను కావాలని జోక్ చేశాను అంటుంది మిస్సమ్మ. నువ్వు ఇప్పుడు జోక్ చేస్తున్నావు. నువ్వు పక్కింటి అక్కతో మాట్లాడాను అనడం అబద్దం అందుకే నీకు ఈ ఫోటో నీకు ఇవ్వను అంటూ దూరంగా వెళ్లి కూర్చుంటుంది అమ్ము. ఫోటో తర్వాత తీసుకుంటానని మిస్సమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆరు ఆస్థికలు ఉన్న స్మశానం దగ్గరకు మనోహరి వస్తుంది. ఆరు అస్థికల కోసం ఘోర ఇక్కడికి తప్పకుండా వస్తాడు. ఘోర రావడానికి ముందే నేను ఆస్థికలు తీసుకుని వెళ్లాలి అని మనసులో అనుకుని లోపలికి వెళ్తుంది. సెక్యూరిటీకి విషయం చెప్పగానే అమరేంద్ర, మిస్సమ్మ లకు తప్పా ఎవ్వరికీ అస్థికలు ఇవ్వొద్దని అమరేంద్ర గారు చెప్పారు అంటాడు. దీంతో మనోహరి పక్కకు వెళ్తుంది. సెక్యూరిటీకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లగానే మనోహరి తాళాలు తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇంతలో అమర్, రాథోడ్ అక్కడకు వస్తారు.
లోపలికి వెళ్లిన మనోహరి ఈ లాకర్ తాళం ఇందులో లేదే అని భయపడుతూ బయటకు వస్తుంటే తాళాలు తీసుకుని అప్పుడే అమర్, రాథోడ్ లాకర్ రూంలోకి వెళ్తుంటారు. అమర్‌ను చూసిన మనోహరి షాక్ అవుతుంది. నువ్వేంటి అమర్ ఇక్కడకు వచ్చావు అని అడుగుతుంది. అది నేను అడాలి నిన్ను అంటాడు అమర్. ఇంతలో సెక్యూరిటీ మీరు లోపలికి ఎలా వెళ్లారు మేడం. మీకు అరుందతి ఆస్థికలు ఇవ్వడం కుదరదు అన్నాను కదా అంటాడు. జరిగిన విషయం మొత్తం సెక్యూరిటీ చెప్తుంటే మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?