Nitish Kumar Reddy Family: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి టీమిండియా సీనియర్ ప్లేయర్లు విఫలమైన చోట నితీష్ కుమార్ రెడ్డి తన వీరోచిత ఇన్నింగ్స్ తో భారత జట్టును ఆదుకున్నాడు.
Also Read: Nitish Reddy: నితీష్ కుమార్ స్వాగ్.. హాఫ్ సెంచరీతో పుష్ప, సెంచరీతో సలార్!
176 బంతులలో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో 105 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన నితీష్ కీలక ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు. అంతేకాకుండా టీమ్ ఇండియాని ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ సిరీస్ లో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్న నితీష్.. క్లిష్ట సమయాలలో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టుకు ఆపద్బాంధవుడిలా మారుతున్నాడు. బాక్సింగ్ డే టేస్ట్ లో భారత బ్యాటర్లు అందరూ విఫలం అవుతున్న నేపథ్యంలో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
అయితే టెస్టుల్లో నితీష్ కి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై ఎనిమిదవ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) పేరిట ఈ రికార్డ్ ఉండేది. ఈ రికార్డ్ ని ఇప్పుడు అధిగమించాడు నితీష్ కుమార్. అయితే మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ మూడవరోజు నితీష్ సాధించిన ఈ సెంచరీ చరిత్రలో ఎప్పుడు గుర్తుండిపోతుందని అన్నాడు నితీష్ తోటి ఆటగాడు వాషింగ్టన్ సుందర్.
“నితీష్ ఓ అద్భుతమైన ఆటగాడు. మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. అతడు మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంజిసి) లో చేసిన ఈ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతనికి ఏ పని అప్పగించిన 100% దానికి న్యాయం చేస్తాడు. నితీష్ సెంచరీ చేయడం మా అందరికీ ఆనందం కలిగించింది” అని పేర్కొన్నాడు వాషింగ్టన్ సుందర్. ఇక నితీష్ కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( ఏసిఏ) రూ. 25 లక్షల నగదు బహుమతిని అందించింది. ఈ మేరకు ఏసిఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నితీష్ పై ప్రశంసలు కురిపించారు. నితీష్ తన భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు చేయబోతున్నాడని.. వేలాది పరుగులు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అతడు సాధించిన ఈ సెంచరీ భారత క్రికెట్ చరిత్రలో ఓ అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలవాలని పేర్కొన్నారు. అయితే మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వద్ద నితీష్ కుమార్ ని హత్తుకొని అతని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీసీసీఐ షేర్ చేయడంతో భారత క్రీడాభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
అయితే ఈ వీడియోకి ముందు నితీష్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ… ” మా కుటుంబానికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈరోజును నా జీవితంలో అస్సలు మర్చిపోలేను. నేను ప్రత్యక్షంగా నితీష్ సెంచరీని చూడడం మాటలలో చెప్పలేకపోతున్నాను. నా కుమారుడు 99 పరుగుల మీద ఉన్నప్పుడు ఎంతో టెన్షన్ కి గురయ్యాను. ఆ సమయంలో ఒక్క వికెట్ మాత్రమే మిగిలి ఉంది. సిరాజ్ చాలా బాగా ఆడాడు. చివరికి నితీష్ సెంచరీ సాధించడం ఎంతో ఆనందం కలిగించింది” అని పేర్కొన్నాడు నితీష్ కుమార్ తండ్రి ముత్యాల రెడ్డి.
సెంచరీతో చెలరేగిన తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ని డ్రెస్సింగ్ రూమ్ వద్ద హత్తుకుని భావోద్వేగానికి గురైన తల్లిదండ్రుల#nitishkumarreddy #Cricket
(Video Source: BCCI) pic.twitter.com/fxn0eJiRwo
— greatandhra (@greatandhranews) December 28, 2024