Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 16 నుంచి 22 వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ శక్తియుక్తులతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు అనూహ్యంగా వసూలవుతాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొని ఊరట చెందుతారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహినిస్తాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. చేసే పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్థి వివాదాలు గందరగోళంగా మారుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మహిళలకు కీలక సమాచారం అందుతుంది. సినిమా పరిశ్రమలో ఉన్న వారిని ఈ వారం నిరుత్సాహమే ఎదరవుతుంది.
మిథునం: ఆస్థి వివాదాలు చికాకు కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నేతల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కర్కాటకం: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి కనిపిస్తుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రచయితలకు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఈ వారం అనుకూల రంగు నేరేడు పండు రంగు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.
సింహం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో సమస్యలు ఏర్పడతాయి. భూముల వ్యవహారాలలో ఒత్తిడులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు ఏర్పడతాయి. కళాకారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పారిశ్రామిక, రాజకీయనాయకులకు చిక్కులు తప్పవు. విద్యార్థులకు అవకాశాలు చేజారిపోతాయి. మహిళలకు అనారోగ్య సమస్యలే వచ్చే అవకాశం ఉంది.
కన్య: పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు ఊపందుకుంటాయి. రచయితలకు, క్రీడాకారులకు అనుకూల సమయం. విద్యార్తులకు నూతన అవకాశాలు సంతోషినిస్తాయి. మహిళలకు చికాకులు తొలగిపోతాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
తుల: రాబడి తగ్గి నిరుత్సాహ పడతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. రాజకీయ, పారిశ్రామిక వేత్తల విదేశీ పర్యటనలు రద్దు అవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.
వృశ్చికం: వారం మొదట్లో కష్టానికి తగ్గిన ప్రతిఫలం కనిపించదు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పట్టుదల, ధైర్యంతో కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. నగల, ఇతల విలువైన వస్తువులు కొంటారు.
ధనస్సు: ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కీలక సమాచారం సంతోషాన్నిస్తుంది. ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యలు తీరిపోతాయి.
మకరం: అనుకున్న పనులు మధ్యలోనే వదిలేస్తారు. కుబుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి వారం మొత్తం చికాకులు తప్పవు. మహిళలకు అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపారులకు పనిభారం పెరుగుతుంది. సినిమా రంగంలోని వారికి ఈజీగా అవకాశాలు దక్కవు.
కుంభం: కొత్త కార్యక్రామాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యాక్రమాలలో మరింత చురుకుగా పాల్గొంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుంతుంది. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారల విస్తృతిలో భాగస్వాముల చేయూత లభిస్తుంది. ఉద్యోగుల సేవలు విసృతమవుతాయి. కళారంగాల వారికి అనుకూల సమయం.
మీనం: ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడుతూ పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురొగతి సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మీ నిర్ణయాలు అదరినీ ఆకట్టుకుంటాయి. మహిళలకు ఆకస్మిక ధనప్రాప్తి. పారిశ్రామికవేత్తల, కళారంగాల వారి ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?